Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డే వరల్డ్ కప్ జట్టును రెడీ చేస్తున్న బీసీసీఐ.. 20 మందిపై ఫోకస్..!

India squad for ODI World Cup BCCI select 20 players

గతేడాది టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారిన విషయం సెలెక్షన్. ఒక్క ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లను మార్చారు. దీంతో ఒక జట్టు కుదురుగా లేకుండా పోయింది. ఒక సిరీస్‌లో ఒకరుంటే.. ఆ తర్వాత ఆ ప్లేయర్ మళ్లీ ఎప్పుడు కనిపిస్తాడో తెలియని అసందిగ్ధత నెలకొంది. టీ20 వరల్డ్ కప్ వంటి కీలకమైన టోర్నమెంట్ జరిగే సమయానికి కూడా టీమిండియా ప్రయోగాలు పూర్తి కాలేదనే చెప్పాలి. దాని ప్రభావం జట్టుపై ఎంతలా పడిందో వేరే చెప్పక్కర్లేదు.

కెప్టెన్ల పర్వానికి ఫుల్‌స్టాప్..

కెప్టెన్ల పర్వానికి ఫుల్‌స్టాప్..

విరాట్ కోహ్లీ శకం ముగిసిన తర్వాత టీమిండియా ఎన్నో ఎత్తుపల్లాల్లో ప్రయాణించింది. అధికారికంగా రోహిత్ శర్మను కెప్టెన్‌గా ప్రకటించిన సెలెక్టర్లు.. పలు సిరీసుల్లో విశ్రాంతి పేరిట అతన్ని పక్కన పెట్టారు. ఆ సమయంలో శిఖర్ ధవన్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ అందరూ జట్టుకు నాయకత్వం వహించిన వాళ్లే. అలాగే జట్టులో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు? అనే విషయంపై కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది. దీంతో ఏ ఆటగాడూ కాన్ఫిడెన్స్‌గా రిస్కులు తీసుకోలేకపోయాడు.

ఆ పొరపాటు రిపీట్ అవకుండా..

ఆ పొరపాటు రిపీట్ అవకుండా..

ఈ సమస్యలకు చెక్ పెట్టాలని రోజర్ బిన్నీ నేతృత్వంలోని బీసీసీఐ నిర్ణయించింది. గంగూలీ సమయంలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్న బీసీసీఐ.. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పుడే ఒక జట్టును సెలెక్ట్ చేసేసిందట. మొత్తం 20 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసి, వారిని వన్డే వరల్డ్ కప్ నాటికి సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది. వరల్డ్ కప్ కోసం ప్రకటించే జట్టు వీళ్ల నుంచే ఉంటుందని దాదాపు కన్ఫర్మ్ చేసేసింది. వీళ్ల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలతో కూడా మాట్లాడి, సదరు ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ విషయంలో కలుగజేసుకోవాలని డిసైడ్ అయింది.

ఆ జట్టు ఇదేనా?

ఆ జట్టు ఇదేనా?

బీసీసీఐ ఎంపిక చేసిన 20 మంది గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ జట్టులో కన్ఫర్మ్ అయిపోయారు. అలాగే ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, బ్యాకప్‌గా శుభ్‌మన్ గిల్ లేదా శిఖర్ ధవన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

విరాట్ కోహ్లీ ఉండనే ఉన్నాడు. ఇక మిడిలార్డర్ కోసం కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, రిషభ్ పంత్ ఉన్నారు. ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెలెక్ట్ అయ్యారు.

పేస్ బౌలింగ్ యూనిట్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌పై ఫోకస్ పెట్టనున్నారు. స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకున్నారట. వీళ్లను వన్డే వరల్డ్ కోసం సిద్ధం చేయాలని, చివర్లో ఆటతీరును బట్టి వరల్డ్ కప్ ఆడే జట్టును ప్రకటిస్తారని తెలుస్తోంది.

Story first published: Monday, January 2, 2023, 11:53 [IST]
Other articles published on Jan 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+