Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ : కివీస్‌తో టీ20లకు కోహ్లీ, రోహిత్ దూరం.. సంజూకు నో ఛాన్స్.. పృథ్వీ షాకు పిలుపు!

India squad for Newzealand T20I and ODI series announced

శ్రీలంకతో వన్డే సిరీస్ పూర్తయిన వెంటనే భారత జట్టు మరో ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధం అవుతోంది. న్యూజిల్యాండ్‌తో ముందుగా టీ20 సిరీస్ ఆడేందుకు రెడీ అవుతోంది. దీనికి కూడా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. శ్రీలంకతో తొలి టీ20లో గాయపడిన సంజూ శాంసన్‌కు మరోసారి సెలెక్టర్లు మొండి చెయ్యి చూపారు. అతన్ని పరిగణనలోకి కూడా తీసుకోలేదని టాక్ వినిపిస్తోంది.

టీ20లు వదలనన్న రోహిత్

టీ20లు వదలనన్న రోహిత్

లంకతో వన్డే సిరీస్ ముందు మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. తన టీ20 భవితవ్యంపై కూడా పెదవి విప్పాడు. తనకైతే టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలనే ఆలోచనే లేదని స్పష్టం చేశాడు. ఐపీఎల్ తర్వాత ఏమవుతుందో చూద్దామని హింట్ ఇచ్చాడు. అంటే ఐపీఎల్‌లో ప్రదర్శనతోనే టీ20ల్లో కోహ్లీ, రోహిత్‌ల భవితవ్యం తేలనుందన్నమాట. అప్పటి వరకు హార్దిక్ సారధ్యంలోనే టీ20 జట్లును సెలెక్ట్ చేస్తారని తెలుస్తోంది. వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేసేందుకే యువ జట్టుకు సెలెక్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.

సంజూకు ఏమైంది?

సంజూకు ఏమైంది?

శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపికైన కేరళ డ్యాషింగ్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు సెలెక్టర్లు మరోసారి మొండి చెయ్యి చూపారు. ఆ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడిన సంజూ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఫీల్డింగ్ చేసే సమయంలో అతని చేతికి గాయమైంది. దీంతో తర్వాతి రెండు మ్యాచులకు సంజూ దూరమయ్యాడు. వన్డే సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయలేదు. ఇప్పుడు న్యూజిల్యాండ్ సిరీస్‌కు ప్రకటించిన జట్టులో అతని పేరు లేకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అతని స్థానంలో జితేశ్ శర్మను ఎంపిక చేయడం జరిగింది.

అక్షర్ కూడా దూరం

అక్షర్ కూడా దూరం

కివీస్‌తో సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా దూరమయ్యాడు. అతను టీ20 సిరీస్‌కే కాకుండా వన్డే సిరీస్‌లో కూడా ఆడటం లేదు. అతనితోపాటు కేఎల్ రాహుల్ కూడా వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు వీళ్లిద్దరూ వ్యక్తిగత కమిట్‌మెంట్స్ కారణంగా ఈ సిరీసులో ఆడటం లేదని బీసీసీఐ తెలిపింది. ఈ క్రమంలోనే అక్షర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. కాగా, ఈ నెల చివర్లో కేఎల్ రాహుల్ తన ప్రేయసి అతియా శెట్టిని వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

భారత టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠీ, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన మాలిక్

Story first published: Saturday, January 14, 2023, 7:32 [IST]
Other articles published on Jan 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+