Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Squad For NZ Test :కివీస్ టెస్ట్ సిరీస్ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ..కెప్టెన్,వైస్ కెప్టెన్ ఎవరంటే?

India Squad For New Zealand Test Series 2021: Rohit Sharma Out And Ajinkya Rahane As Captain

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌ 2021లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా పూర్తిగా నిరాశపర్చిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో కనీసం సెమీస్‌కు కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. ఇక నవంబర్‌ 17 నుంచి న్యూజిలాండ్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. ఆపై న్యూజిలాండ్, భారత్ జట్లు రెండు టెస్టుల్లో తలపడనున్నాయి. నవంబర్ 25-29 మధ్య కాన్పుర్​లో తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య ముంబై వేదికగా రెండో టెస్టు జరగనుంది. టీ20 సిరీస్ కోసం మంగళవారం జట్టును ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. శుక్రవారం టెస్ట్ సిరీస్ కోసం మరో జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చింది. తీరికలేని క్రికెట్ ఆడడమే అందుకు కారణం.

కెప్టెన్​గా రహానే:

కెప్టెన్​గా రహానే:

న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్​లో తొలి మ్యాచ్​కు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడం లేదు. దీంతో అజింక్య రహానే కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. టెస్ట్ స్పెసలిస్ట్ చటేశ్వర్ పుజారా అతడికి డిప్యూటీగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. రెండో టెస్టుకు కోహ్లీ తిరిగివచ్చి జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అప్పుడు కోహ్లీ కెప్టెన్​గా.. రహానే వైస్ కెప్టెన్​గా ఉండనున్నారు. ఈ సిరీస్​ నుంచి రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, రిషబ్ పంత్​కు సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. శ్రేయాస్ అయ్యర్, జయంత్ యాదవ్ టెస్ట్ జట్టులోకి వచ్చారు. ఇక తెలుగు ఆటగాడు హనుమ విహారి చోటు దక్కలేదు.

రోహిత్ శ‌ర్మ‌కు పగ్గాలు:

రోహిత్ శ‌ర్మ‌కు పగ్గాలు:

భారత్, న్యూజిలాండ్‌​ మధ్య టీ20 సిరీస్ నవంబర్ 17-21 మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ జైపూర్ (నవంబర్ 17), రెండో మ్యాచ్ రాంచీ (నవంబర్ 19), మూడో మ్యాచ్ కోల్​కతా (నవంబర్ 21) వేదికగా జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం బీసీసీఐ మంగళవారం భారత జ‌ట్టును ప్ర‌క‌టించింది. విరాట్ కోహ్లీ ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ టీ20 మ్యాచ్‌ల‌కు కెప్టెన్సీ బాధ్య‌త నుంచి త‌ప్పుకోవ‌డంతో జ‌ట్టు ప‌గ్గాల‌ను స్టార్ ఓపెనర్ రోహిత్ శ‌ర్మ‌కు అందించింది బీసీసీఐ. ఇకపై టీ20లకు రోహిత్ నాయకత్వం వహించనున్నాడు. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ సిరీస్ కోసం విరాట్ కోహ్లీతో సహా రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీలకు సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు.

 భారత టెస్టు జట్టు:

భారత టెస్టు జట్టు:

అజింక్య రహానే (కెప్టెన్), చేటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శుభ్​మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మొహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

భారత టీ20 జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్‌ (వైస్ కెప్టెన్), రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, రిషబ్ పంత్‌, ఇషాన్‌ కిషన్, వెంకటేశ్‌ అయ్యర్‌, యుజ్వేంద్ర చహల్‌, ఆర్ అశ్విన్‌, అక్షర్‌ పటేల్, అవేశ్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్, దీపక్‌ చహర్, హర్షల్‌ పటేల్‌, మహమ్మద్‌ సిరాజ్‌.

Story first published: Friday, November 12, 2021, 13:08 [IST]
Other articles published on Nov 12, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+