Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Squad For Asia Cup: ఇదేం సెలెక్షన్ నాయనా.. జట్టు ఎంపికలో బ్లండర్ మిస్టేక్స్..!

India Squad For Asia Cup : Top 5 Mistakes In india Squad Selection

దుబాయ్ వేదికగా ఆగస్టు 27నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్ టోర్నీలో పాల్గొనే టీమిండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ప్రకటించింది. చేతన శర్మ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ 15మంది సభ్యులను జట్టుకు ఎంపిక చేసింది. అనూహ్యంగా వెన్నుగాయంతో జస్ప్రీత్ బుమ్రా, మరో గాయంతో హర్షల్ పటేల్ దూరమవ్వడంతో అవేష్ ఖాన్‌కు స్క్వాడ్‌లో చోటు దక్కింది. ఇక భారత జట్టు సెలెక్షన్లో స్టార్ డం, గత రికార్డులే ప్రామాణికాలుగా కన్పించాయి.

ప్రస్తుత ప్లేయర్ల ఫామ్, ఇటీవల సత్తా చాటుతున్నవాళ్లకు మొండిచేయి ఎదురైంది. ఎప్పటిలాగే కీలక ఈవెంట్లో తుస్సుమనిపించేవారికే అగ్రతాంబూలం వేసినట్లు కొట్టొచ్చినట్లు కన్పించింది. స్టార్ డం బట్టి ప్లేయర్లను ఎంపిక చేశారు.. కానీ జట్టు కూర్పు విషయాన్ని గాలికొదేసినట్లు స్పష్టమైంది. ఒకసారి సెలెక్షన్లో జరిగిన బ్లండర్ మిస్టేక్స్ పరిశీలిస్తే..

మూడో ఓపెనర్ ఛాయిస్ ఎక్కడ..?

మూడో ఓపెనర్ ఛాయిస్ ఎక్కడ..?

బ్యాటింగ్ లైనప్లో కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగడం దాదాపు ఖాయమే కానీ.. ఒకవేళ వీరిలో ఎవరైనా మిస్సయితే మూడో ఓపెనర్ ఛాయిస్ విషయంలో స్పెషల్ ప్లేయర్ ఎక్కడ? సూర్యకుమార్ యాదవ్ ఇటీవల విండీస్‌తో ఓపెనింగ్ చేసినప్పటికీ, దీపక్ హుడా, పంత్ కూడా ఓపెనర్లుగా దిగినప్పటికీ.. వీళ్లు మిడిలార్డర్లో కీలక ప్లేయర్లు. రోహిత్ గానీ రాహుల్ గానీ మిస్సయితే మళ్లీ జట్టు కూర్పు డిస్టబ్ అవుతుంది. అందువల్ల మూడో ఓపెనర్ ఛాయిస్‌గా ఒకరిని తీసుకోవాల్సింది. అదనపు స్పిన్నర్‌కు బదులు ఇషాన్ కిషన్ లేదా సంజూ శాంసన్లలో ఒకరిని మూడో ఛాయిస్ ఓపెనర్‌గా తీసుకుంటే జట్టు కూర్పు డిస్టబ్ అయి ఉండేది కాదు.

నాలుగో పేస్ ఆప్షన్ ఎక్కడ?

నాలుగో పేస్ ఆప్షన్ ఎక్కడ?

ఈసారి ఏకంగా నలుగురు స్పిన్నర్లను తీసుకున్న సెలెక్షన్ కమిటీ పేస్ విభాగంలో మాత్రం ముగ్గురు స్పెషలిస్టులను మాత్రమే తీసుకుంది. అయితే హార్దిక్ పాండ్యాను నాలుగో పేసర్‌గా వాడుకోవడం మంచిదే కానీ.. కీలక ఈవెంట్ల ముందు అతను కొన్ని సార్లు గాయపడ్డ సంగతి తెలిసిందే. కొన్ని సార్లు ఫుల్ కోటా వేయలేక ఇబ్బంది పడ్డాడు కూడా.

కొన్నిసార్లు అసలు బౌలింగే చేయలేదు. అదే జరిగితే జట్టు కూర్పుకు చాలా ఇబ్బందవుతుంది. మరీ అలాంటప్పుడు పేస్ విభాగంలో అవేష్ ఖాన్‌కు బదులు పేస్ ఆల్రౌండర్ దీపక్ చాహర్‌ను తీసుకుంటే కొంత వరకైనా ఇబ్బందిని అధిగమించొచ్చు కదా..? దీపక్ చాహర్ ఇటీవల కాలంలో క్రికెట్ ఆడలేడనేది ప్రధాన కారణంగా భావిస్తే.. మరీ రాహుల్ సైతం ఐపీఎల్ నుంచి ఆడలేదు కదా..? అతన్ని స్టాండ్‌బై ప్లేయర్‌గా పరిగణించారు.

హార్దిక్ గాయపడి రూల్ ఔట్ అయితే తప్పా అతనికి జట్టులోకి ఎంట్రీ ఉండదు. అయినా నలుగురు స్పిన్నర్లు ఎందుకు.. రవి బిష్ణోయ్‌ను బెంచ్ మీద కూర్చోబెట్టడానికి తప్పా తుది జట్టులో అతన్ని ఆడిస్తారనే నమ్మకమే లేదు. అదేదో దీపక్ చాహర్‌ను ఫోర్త్ పేసర్‌గా తీసుకుంటే పోయేది కదా. అవేశ్ ఖాన్ గానీ అర్షదీప్ గానీ విఫలమైతే దీపక్ ఉన్నాడనే ధీమా అయినా ఉండేది.

అక్షర్ పటేల్ బెటరా అశ్వినా?

అక్షర్ పటేల్ బెటరా అశ్వినా?

ప్రస్తుత ఫామ్ ప్రకారం చూసుకుంటే పరిమిత క్రికెట్లో అక్షర్ పటేల్ ఎంతటి ఫాంలో ఉన్నాడో అందరికీ తెలిసిందే. బౌలింగ్, బ్యాటింగ్లో నిఖార్సైన ప్లేయర్‌గా అతను రాణిస్తున్నాడు. రవీంద్రా జడేజా కంటే కూడా అతను వైట్ బాల్ క్రికెట్లో రాణిస్తున్నాడు. కేవలం సీనియర్లు అయిన కారణంగా అశ్విన్, జడేజాను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు స్పష్టమవుతుంది. భీకర ఫాంలో ఉన్న అక్షర్ పటేల్‌ను మాత్రం స్టాండ్ బైగా ఉంచింది. అశ్విన్ స్థానంలో అక్షర్ పటేల్ ఎంపికవ్వాల్సింది. బ్యాటింగ్లో చాలా అడ్వంటేజీ ఉండేది.

దినేష్ కార్తీక్‌ను తీసుకోకున్నా అయిపోయేది..!

దినేష్ కార్తీక్‌ను తీసుకోకున్నా అయిపోయేది..!

సెలెక్షన్ కమిటీ నిర్లక్ష్యకర రీతి సెలెక్షన్ ఇక్కడే అర్థమవుతుంది. ఫినిషర్‌గా సత్తా చాటుతున్న దినేష్ కార్తీక్‌కు తుది జట్టులో చోటు దక్కే పరిస్థితే లేదు. రోహిత్, రాహుల్ ఓపెనర్లు, కోహ్లీ, సూర్య, పంత్, హార్దిక్ పాండ్యా అక్కడికే ఆరుగురు బ్యాటర్లు పూర్తయిపోయారు. రవీంద్రా జడేజా ఎలాగూ ఏడో బ్యాటర్‌గా కొనసాగుతాడు.

ఇక ఎనిమిదో బ్యాటర్‌‌ను తీసుకునే సాహసం ఇండియా చేస్తుందా అంటే అది జరగని పని.. అందువల్ల దినేష్ కార్తీక్ తుది జట్టులో ఆడడం దాదాపు అసంభవమే అని చెప్పాలి. అతను జట్టులో ఎవరైన కర్మకాలి గాయపడి పూర్తిగా జట్టుకు దూరమైతే తప్పా అతను ఆడడం జరగదు. ఎందుకంటే టాపార్డర్లో ఎవరినీ పక్కన పెట్టలేని ప్లేయర్లను ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీ మరోసారి దినేష్ కార్తీక్ స్థానానికి ఎండ్ కార్డ్ పడేలా చేసింది.

ఒక్క పార్ట్ టైమ్ బౌలర్ లేడు

ఒక్క పార్ట్ టైమ్ బౌలర్ లేడు

ఇక టాపార్డర్లో ఒక్కరు కూడా పార్ట్ టైం బౌలర్ లేకపోవడం ఇండియాకు బిగ్ మైనస్. దీపక్ హుడా ఉన్నా.. అతన్ని సూర్యకుమార్‌ను గానీ, కోహ్లీని గానీ తప్పించి ఆడించడం దాదాపు కష్టమే. రోహిత్ శర్మ , కోహ్లీ బౌలింగ్ వేయగలుగుతారు గానీ టీ20లాంటి ఫార్మాట్లో వాళ్ల చేత వేయించడం పెద్ద రిస్కే అని చెప్పాలి. అందువల్ల ఇండియా తప్పకుండా అయిదుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగాల్సిన అవసరముంటుంది. ఇకపోతే దీపక్ హుడా, దినేష్ కార్తీక్, రవి బిష్ణోయ్, రవిచంద్రన్ అశ్విన్ దాదాపుగా బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది.

భారత ప్లేయింగ్ 11 అంచనా

భారత ప్లేయింగ్ 11 అంచనా

ఒకవేళ ముగ్గురు పేసర్లను ఆడిస్తే : 1.కెప్టెన్ రోహిత్ శర్మ, 2.కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), 3. విరాట్ కోహ్లీ, 4.సూర్యకుమార్ యాదవ్, 5.రిషబ్ పంత్, 6.హార్దిక్ పాండ్యా, 7.రవీంద్రా జడేజా, 8.భువనేశ్వర్ కుమార్, 9.అర్షదీప్ సింగ్, 10.అవేశ్ ఖాన్, 11.యుజ్వేంద్ర చాహల్

ఒకవేళ ఇద్దరు పేసర్లను ఆడిస్తే : 1. రోహిత్ శర్మ (కెప్టెన్), 2. కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), 3. విరాట్ కోహ్లీ, 4.సూర్యకుమార్ యాదవ్, 5.రిషబ్ పంత్, 6.హార్దిక్ పాండ్యా, 7.రవీంద్రా జడేజా, 8.భువనేశ్వర్ కుమార్, 9.అర్షదీప్ సింగ్, 10.రవిచంద్రన్ అశ్విన్/రవి బిష్ణోయ్, 11.యుజ్వేంద్ర చాహల్

భారత జట్టు

భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవిబిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్.

Story first published: Monday, August 8, 2022, 23:00 [IST]
Other articles published on Aug 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+