న్యూఢిల్లీ: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ఎంపిక చేశారు. పదిహేను మందితో కూడిన ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశారు. కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. రహానే వైస్ కెప్టెన్.
విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, రహానే, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), యువరాజ్ సింగ్, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, అశ్విన్, జడెజా, షమి, ఉమేష్, భువనేశ్వర్, బూమ్రా, మనీష్ పాండేలకు చోటు దక్కింది.
కేదార్ జాదవ్‌ను సెకండ్ కీపర్‌గా ఎంచుకున్నారు. హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్‌లకు చోటు దక్కలేదు. గాయం నుంచి రోహిత్ శర్మ, మహ్మద్ షమి కోలుకుంటున్నారు.