మెల్బోర్న్: ప్రపంచ కప్‌లో భాగంగా మెల్బోర్న్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, రవీంద్ర జడెజాలు ఆకట్టుకున్నారు. లీగ్ దశలో వారు ఆశించిన మేర రాణించలేదు. దీనిపై విమర్శలు వస్తే.. ధోనీ వారిని వెనుకేసుకు వచ్చాడు. వారికి సమయం ఇవ్వాలని హితవు పలికాడు.
అయితే, కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో.. ధోనీ నమ్మకాన్ని వారు వమ్ము చేయలేదు. రోహిత్, జడెజా.. ఇద్దరు కూడా బాగా రాణించారు. లీగ్ దశలో ఆడిన వారు ఈ మ్యాచ్‌లో ఒకింత విఫలమయ్యారు. ధవన్ 50 బంతుల్లో 30 పరుగులు, కోహ్లీ 8 బంతుల్లో 3 పరుగులు, రహానే 37 బంతుల్లో 19 పరుగులు, ధోనీ 11 బంతుల్లో 6 పరుగులు చేశారు.
రైనా మాత్రం 57 బంతుల్లో 65 పరుగులు చేసి రోహిత్ శర్మకు అండగా నిలబడ్డాడు. రోహిత్ శర్మ 126 బంతుల్లో 3 సిక్స్‌లు, 14 ఫోర్లతో 137 పరుగులు చేశాడు. మొదట రెండు వికెట్లు పడిపోయినప్పుడు భారత్ కొంత ఆత్మరక్షణలో పడినట్లు కనిపించింది. ఆ తర్వాత రోహిత్ బంగ్లా బౌలర్లను ఆడుకున్నాడు.

అయితే, రోహిత్ శర్మ దూకుడుతో భారత్ భారీ స్కోర్ దిశగా వెళ్లింది. ఆ తర్వాత రవీంద్ర జడెజా కూడా చివర్లో మెరుపులు మెరిపించాడు. అతను 10 బంతుల్లో 23 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ, రవీంద్ర జడెజా, రైనాలు రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది.
కాగా, ఇటీవల ధోనీ మాట్లాడుతూ... రోహిత్ శర్మను తక్కువగా అంచనా వేయవద్దని, టోర్నీలో ఇప్పటివరకు అతడు చేసిన పరుగులు తక్కువే అయినా.. కుదురుగా బ్యాటింగ్ చేస్తున్నాడని అభిప్రాయపడ్డాడు.
'కేవలం పరుగులకే ప్రాధాన్యమివ్వకూడదు. బాగా ఆడుతున్న బ్యాట్స్‌మెన్ కూడా అప్పుడప్పుడు పరుగులు చేయలేకపోతారు. ఏదో ఒక మ్యాచ్‌లో వీరవిహారంతో మళ్లీ ఊపులోకి వస్తుంటాడు. అది ఫామ్‌లో లేకపోవడం కాదు. క్రీజులో ఎక్కువసేపు ఉండటం బ్యాట్స్‌మన్‌కు ముఖ్యం. రోహిత్ బాగానే ఆడుతున్నాడు' అని ధోనీ వివరించాడు.
'గ్రూప్ మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేసే అవకాశాలు జడేజాకు పెద్దగా రాలేదు. జింబాబ్వేతో మ్యాచ్‌లో జడేజా భారీగా పరుగులు సమర్పించుకున్నమాట వాస్తవమే. కానీ అక్కడి బౌండరీలు చాలా చిన్నవి. పైగా టేలర్ అద్భుతంగా ఆడాడు. కాబట్టి ఆందోళన పడాల్సిందేమీ లేదు' అని ధోని తెలిపాడు. మరో సందర్భంలోను రోహిత్ శర్మ, జడెజాలను వెనుకేసుకొచ్చాడు.