ప్రపంచంలోని ఏ జట్టుతోనైనా పోటీ పడగలం: కోహ్లీ

వెల్లింగ్‌టన్: ప్రపంచంలోని ఏ జట్టుతోనైనా టీమిండియా పోటీ పడగలదు. ప్రతి జట్టుతో సునాయాసంగా తలపడే రీతిలో మేం సిద్ధమయ్యాం అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాం. కివీస్ జట్టులో మంచి నైపుణ్యం ఉన్న బ్యాట్స్‌మన్‌లు, బౌలర్లు, ఫీల్డర్లు ఉన్నారు. వారందరిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించాం అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఏ జట్టుతోనైనా పోటీ పడగలం:
మంగళవారం కెప్టెన్లు విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్‌లు టెస్టు సిరీస్ ట్రోఫీని వెల్లింగ్‌టన్‌లో ఆవిష్కరించారు. ఆపై ఇద్దరు ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోను బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ట్రోఫీని ఆవిష్కరణ అనంతరం కోహ్లీ, కేన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మా ఫిట్‌నెస్, ఏకాగ్రత స్థాయిలు ప్రపంచంలో ఏ జట్టుతోనైనా పోటీపడేలా చేసాయి. పూర్తి విశ్వాసం, సానుకూల దృక్పథంతో టెస్ట్ సిరీస్‌ను ప్రారంభించబోతున్నాం' అని అన్నాడు.

కౌంటర్ ఎక్కడినుండి వస్తుందో ఊహించలేం:
'ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో ప్రేక్షకులు భారీ పాత్ర పోషిస్తున్నారు. ఎంతో ఉద్రేకంతో ఉంటారు. అన్ని కోణాల నుండి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. న్యూజిలాండ్‌లో ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభిమానులు కూడా పూర్తి క్రమశిక్షణతో ఉంటారు. అభిమానులు కూడా ఫిట్‌గా ఉంటారు. రోజంతా మైదానంలోనే కూర్చుని.. ఆటగాళ్ల సహనాన్ని పరీక్షిస్తారు. ఏ వైపు నుంచి కౌంటర్ వస్తుందో ఊహించలేం. ఆఫ్‌ఫీల్డ్ కంటే కూడా ఆన్‌ఫీల్డ్‌పై ఎక్కువ దృష్టి సారించాలి' అని కోహ్లీ పేర్కొన్నాడు.

వ్యూహాలు రచించాం:
'న్యూజిలాండ్ జట్టులో మంచి నైపుణ్యం ఉన్న బ్యాట్స్‌మన్‌లు, బౌలర్లు, ఫీల్డర్లు ఉన్నారు. వారందరిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించాం. అయితే సొంతగడ్డపై సిరీస్ ఆడటం కివీస్‌కు కలిసి వచ్చే అంశం. మా జట్టులో సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యారు. ఇపుడు పూర్తిగా కొత్త టీం. కొత్త ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇక్కడి మైదానాలలో చాలా ఏకాగ్రత అవసరం' అని కోహ్లీ కోహ్లీ తెలిపాడు.

కేన్ విజయాల గురించి అవగాహన ఉంది:
'సొంతగడ్డపై కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ విజయాల గురించి అవగాహన ఉంది. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న మేము.. వన్డే సిరీస్‌ను కోల్పోయాయాం. గెలుపోటములు సహజమే కాబట్టి సానుకూల దృక్పథంతో టెస్టు సిరీస్ సిద్ధమవుతున్నాం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

కోహ్లీపై మరింత భారం:
ఈ నెల 21 నుండి వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. వన్డే, టీ20 సిరీస్‌లో పరుగులు చేయలేకపోయిన కెప్టెన్ విరాట్ కోహ్లీకి టెస్టు సిరీస్ రూపంలో అసలైన సవాల్ ఎదురుకాబోతోంది. ఐదు టీ20లలో 105 పరుగులు, మూడు వన్డేలలో 75 పరుగులే చేసిన కోహ్లీ పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా గాడిలో పడుతాడేమో చూడాలి. మరోవైపు రోహిత్ శర్మ కూడా దూరమవడంతో కోహ్లీపై మరింత భారం పడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications