Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మీ అభిమాన క్రికెటర్ ఎవరు?: పాక్ జర్నలిస్ట్‌కు మిథాలీ దిమ్మదిరిగే సమాధానం

హైదరాబాద్: పురుష క్రికెటర్లకు మహిళా క్రికెటర్లకు చాలా వ్యత్యాసం ఉంటుందని భారత మహిళ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. అంతేకాదు తమను పురుష క్రికెటర్లతో ఎంతమాత్రం పోల్చవద్దని తేల్చి చెప్పింది. మహిళల వన్డే వరల్డ్ కప్ - 2017 జూన్‌ 24 నుంచి ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే జట్ల కెప్టెన్ల కోసం ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ విందుకు భారత కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా హాజరయ్యారు. ఈ ప్రత్యేక విందు కార్యక్రమం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాకిస్థాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మిథాలీ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏమిటంటే

ఇంతకీ ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏమిటంటే... భారత్‌, పాకిస్థాన్‌ జట్టులో మీ అభిమాన క్రికెట్‌ ఎవరు? అని ప్రశ్నించాడు. ఇదే ప్రశ్న పురుష క్రికెటర్ని అడుగుతారా అంటూ తీవ్రంగా స్పందించింది. మీకు ఇష్టమైన మహిళా క్రికెటర్ ఎవరు అని పురుష క్రికెటర్లని అడగనప్పుడు.. పురుష క్రికెట్ జట్టులో ఇష్టమైన క్రికెటర్ ఎవరు అని ఎలా అడుగుతారు అంటూ ప్రశ్నించింది.

పురుష క్రికెటర్లకు ఉన్న క్రేజ్ మాకు ఉండదు

గత కొంతకాలంగా ఇదే ప్రశ్న తనకు ఎదురవుతూనే ఉందని మిథాలీ కాస్త అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం పురుష క్రికెటర్లకు ఉన్న క్రేజ్ తమకు ఉండదని, అలాంటప్పుడు వారితో పోల్చడం సమంజసం కాదని పేర్కొంది. ఈ క్రమంలోనే తమకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాల్సిన అవసరం కూడా ఉందని మిథాలీ స్పష్టం చేసింది.

మా మ్యాచ్‌లు జరిగితే టీవీల్లో టెలికాస్ట్ చేయరు

‘భారత్‌లో పురుష క్రికెటర్స్‌కి ఉన్నంత క్రేజ్‌ మహిళా క్రికెటర్లకు ఉండదు. ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం చూపిస్తారు. మా మ్యాచ్‌లు జరిగితే టీవీల్లో టెలికాస్ట్ చేయరు. కేవలం పురుషుల క్రికెటర్ల మ్యాచ్‌ల్నే ప్రసారం చేస్తారు. ఆ తరుణంలో వారితో మాకు పోలిక తేవద్దు. క్రికెట్ అభివృద్ధి కోసం మా పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తించడానికి యత్నిస్తున్నా ఎప్పుడూ మాకు చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది' అని మిథాలీ పేర్కొంది.

మహిళల క్రికెట్ కూడా తగిన గౌరవం దక్కాలి

మహిళల క్రికెట్ కూడా తగిన గౌరవం దక్కాలి

'మహిళల క్రికెట్ కూడా తగిన గౌరవం దక్కాలి. అయినా వారికి ఉన్నంత గుర్తింపు మాకు లేదు. మాకు కోచ్‌గా కూడా పురుషుడే ఉంటాడు. మాకు కోచ్‌లుగా పురుషులు ఉండటం వల్ల ట్రైనింగ్ సెషన్ చాలా కఠినంగా ఉంటుంది' అని మిథాలీ రాజ్ పేర్కొంది. తుషార్‌ అరోద్‌ మా జట్టుకి ప్రస్తుతం కోచ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన నేతృత్వంలో మా జట్టు మంచి విజయాలు సాధిస్తోంది.

చిన్నబోయిన జర్నలిస్ట్

చిన్నబోయిన జర్నలిస్ట్

దీంతో ఆ జర్నలిస్ట్ చిన్నబోయారు. అయితే మిథాలీ రాజ్ చెప్పిన సమాధానాన్ని పలువురు క్రికెట్ విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో 5,500 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్‌ అరుదైన ఘనత సాధించింది. దీంతో పాటు 100 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించిన మూడో మహిళా క్రికెటర్.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+