ముంబై: ప్రపంచ కప్ ట్వంటీ 20లో భాగంగా శనివారం నాడు భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీనిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ భారత జట్టుకు హెచ్చరికలు జారీ చేశాడు. ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై అజేయ రికార్డు కలిగిన మన జట్టు ఉదాసీనత దరిచేరనీయకూడదన్నాడు.

అతి విశ్వాసం మంచిది కాదని, రికార్డు బాగుందని గెలిచేస్తామనుకోకూడదన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడడం చాలా ముఖ్యమని చెప్పాడు. అప్పుడు విజయాలు వాటంతట అవే వస్తాయని చెప్పాడు. అయినా భారీ మ్యాచ్‌లకు ఎలా సిద్ధమవ్వాలో మన జట్టుకు బాగా తెలుసునని చెప్పాడు.
జట్టులో అద్భుత ఆటగాళ్లున్నారని, వారు ఏ మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకోరని చెప్పాడు. కోల్‌కతాలో అభిమానుల మద్దతు ఎప్పుడూ భారత్‌కే ఉంటుందని, దీనిని మన సొమ్ము చేసుకోవాలన్నాడు. అక్కడి అభిమానుల మద్దతును అడ్వాంటేజ్‌గా తీసుకోవాలన్నాడు.