Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా.. ఛలో దక్షిణాఫ్రికా: మరో సుదీర్ఘమైన షెడ్యూల్: విమానం ఎక్కేది ఆ రోజే

India set to leave for South Africa tour on 8th December, a day after New Zealand Test series finishes
IND Vs SA 2021 Series Schedule, ఏ మ్యాచ్ ఎప్పుడంటే..! || Oneindia Telugu

ముంబై: న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా.. ఇక టెస్ట్ సిరీస్‌ను ఆరంభించనుంది. రెండు టెస్టుల సిరీస్ ఇది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఏకపక్షంగా ముగించేసింది భారత జట్టు. 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక టెస్టుల్లోనూ అదే తరహా దూకుడును ప్రదర్శించడానికి సమాయాత్తమౌతోంది. దీనికోసం నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తోంది. తొలి టెస్ట్ గురువారం ఆరంభం కానుంది. మరోవంక న్యూజిలాండ్ పరిస్థితి కూడా ఇంతే. టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన బ్లాక్ క్యాప్స్.. ప్రతీకారం కోసం కాచుకుని కూర్చుంది.

 ఛలో దక్షిణాఫ్రికా..

ఛలో దక్షిణాఫ్రికా..

న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసిన వెంటన టీమిండియా.. దక్షిణాఫ్రికా విమానం ఎక్కనుంది. మరో సుదీర్ఘమైన సిరీస్ ఆడనుంది. వచ్చేనెల ఈ సిరీస్ మొదలవుతుంది. సఫారీల గడ్డకు ప్రయాణమౌతుంది టీమిండియా. న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ముగిసిన మరుసటి రోజే భారత క్రికెట్ జట్టు.. దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్తుంది. న్యూజిలాండ్‌తో సిరీస్ డిసెంబర్ 7వ తేదీన ముగియనుండగా.. 8వ తేదీన దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్తుంది.

సుదీర్ఘమైన సిరీస్..

సుదీర్ఘమైన సిరీస్..

టీమిండియా మరో టైట్ షెడ్యూల్‌ను ఎదుర్కొనబోతోంది- దక్షిణాఫ్రికా పర్యటన రూపంలో. మూడు టెస్టులు, మూడు వన్డే ఇంటర్నేషనల్స్, నాలుగు టీ20 ఇంటర్నేషనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఢీ కొట్టనుంది భారత జట్టు. చివరి టీ20 మ్యాచ్ జనవరి 26వ తేదీన ఉంటుంది. అక్కడితో ఈ పర్యటన ముగిసిపోతుంది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ వచ్చేనెల 17వ తేదీన మొదలవుతుంది. 21వ తేదీన ముగుస్తుంది.

షెడ్యూల్ ఇదే..

షెడ్యూల్ ఇదే..

రెండో టెస్ట్ మ్యాచ్ అదే నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉంటుంది. చివరిదైన మూడో టెస్ట్ మ్యాచ్ జనవరి 3వ తేదీ ఆరంభమౌతుంది..7న ముగిసిపోతుంది. టెస్ట్ సిరీస్ తరువాత.. మూడు మ్యాచ్‌ల వన్డేలు, నాలుగు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్ మొదలవుతుంది. జనవరి 26వ తేదీన చివరి టీ20ని షెడ్యూల్ చేసింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు. ఆ తరువాత శ్రీలంక షెడ్యూల్‌ను రూపొందించింది బీసీసీఐ.

కోన భరత్‌కు ఛాన్స్..

కోన భరత్‌కు ఛాన్స్..

వికెట్ కీపర్, తెలుగు కుర్రాడు కోన శ్రీకర్ భరత్ దక్షిణాఫ్రికా పర్యటన కోసం ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అతను న్యూజిలాండ్‌తో ఆడబోయే తొలి టెస్ట్ కోసం జట్టులో చోటు దక్కించుకున్నాడు. తుది జట్టులో ఉంటాడా? లేదా? అనేది తేలాల్సి ఉంది. వృద్ధిమాన్ సాహాకు ప్రత్యామ్నాయంగా భరత్‌ను జట్టులోకి తీసుకుంది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. తొలి టెస్ట్‌లో అతనికి ఆడే అవకాశం వస్తే.. తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఓ మోస్తరుగా ఆడినా.. దక్షిణాఫ్రికా టూర్ కోసం బెర్త్ కన్‌ఫర్మ్ అయినట్టే.

కాన్పూర్ టెస్ట్ స్క్వాడ్ ఇదే

కాన్పూర్ టెస్ట్ స్క్వాడ్ ఇదే

ఎల్లుండి కాన్పూర్‌లో ఆరంభం అయ్యే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం జట్టు ప్రాక్టీస్ చేస్తోంది. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, శ్రేయాస్ అయ్యర్, అజింక్య రహానె (కేప్టెన్), కేఎస్ భరత్, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్‌ను టెస్ట్ స్క్వాడ్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. తొలిమ్యాచ్‌లో కేఎస్ భరత్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

Story first published: Wednesday, November 24, 2021, 11:00 [IST]
Other articles published on Nov 24, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+