Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్ లక్ష్యం 374: భారత్ 284/6 డిక్లేర్డ్


Dinesh Kartikబెంగుళూర్: పాకిస్తాన్ పై జరుగుతున్న మూడో టెస్టు ఐదో రోజు భారత్ తన రెండో ఇన్నింగ్సును 284 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అప్పటికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయింది. దాంతో భారత్ కు మొత్తం 374 పరుగుల ఆధిక్యత లభించింది. ఈ మ్యాచును గెలవాలంటే పాకిస్తాన్ 48 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. భారత్ పాకిస్తాన్ ను ఆలవుట్ చేయకపోతే మ్యాచ్ డ్రా అవుతుంది. ఇప్పటికే ఒక మ్యాచును గెలుచుకున్న భారత్ మూడు టెస్టుల సిరీస్ ను గెలుచుకుంటుంది. దినేష్ కార్తిక్ అవుట్ కాగానే భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేశాడు. కార్తీక్ 52 పరుగులు చేశాడు. పఠాన్ 21 పరుగులతో నాటవుటుగా మిగిలాడు. లక్ష్మణ్ 14 పరుగులు చేసి అక్తర్ బౌలింగులో గాయపడి రిటైర్డ్ హర్టుగా వెనుదిరిగాడు.

అంతకు ముందు రెండు వికెట్ల నష్టానికి 131 పరుగులతో ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్ కొంతసేపు దూకుడు ప్రదర్శించినప్పటికీ, వెంటవెంటనే ఓవర్నైట్ బ్యాట్స్‌మెన్ ద్రావిడ్, గంగూలీ వికెట్లను కోల్పోయింది. గంగూలీ ధాటిగా ఆడుతూ 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కాగా, ద్రావిడ్ 42 పరుగులు చేశాడు. గంగూలీ, ద్రావిడ్‌లతో పాటు యువరాజ్ కూడా నిష్క్రమించగా, బెంగుళూరులో పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఆధిక్యం 310కు చేరుకుంది. సమి బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ద్వారా యువరాజ్ (2) నిష్క్రమించాడు. భోజన విరామ సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. గంగూలీ (91), ద్రావిడ్ (42)లు మూడో వికెట్‌కు 152 పరుగులు జోడించారు. పాకిస్థాన్ బౌలర్లలో మొహమద్ సమీ, యాసిర్ అరాఫత్ రెండేసి వికెట్లు తీసుకోగా, షోయబ్ అక్తర్, డేనిష్ కనేరియాలు చెరో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 626 పరుగులు చేయగా, దీనికి సమాధానంగా పాకిస్థాన్ 537 పరుగులు మాత్రమే చేయడంతో భారత్‌కు 269 పరుగుల ఆధిక్యం లభించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో గంగూలీ (239), యువరాజ్ సింగ్ (169), పఠాన్ (102)లు రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో యాసిర్ అరాఫత్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. పాకిస్థాన్ జట్టులో మిస్బా ఉల్ హక్ (133), యూనిస్ ఖాన్ (80)లు రాణించారు.
Story first published: Sunday, December 23, 2007, 23:53 [IST]
Other articles published on Dec 23, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+