323 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా

అడిలైడ్: ఆస్ట్రేలియాకి తొలి టెస్టులోనే పర్యాటక భారత్ జట్టు సవాల్ విసిరింది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా (71: 204 బంతుల్లో 9 ఫోర్లు), అజింక్య రహానె (70 బ్యాటింగ్: 147 బంతుల్లో 7ఫోర్లు) హాఫ్ సెంచరీలు బాదడంతో 323 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకి భారత్ నిర్దేశించింది. టెస్ట్ విజయం కోసం పరితపిస్తున్న ఇండియాకి ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు సుస్ఫష్టంగా కనిపిస్తున్నాయి.

151/3తో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్
ఆటలో నాలుగో రోజైన ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 151/3తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టు.. 275 పరుగులు ఆధిక్యం లభించగా భోజన విరామ అనంతరం రహానె మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. షమీ, ఇషాంత్ డకౌట్ కాగా బుమ్రా నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో లైయన్ ఆరువికెట్లు తీయగా.. స్టార్క్ 3, హేజిల్ వుడ్ ఒక వికెట్ తీశారు.

307 పరుగులకి ఆలౌటైన టీమిండియా
లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ విఫలమవడంతో 307 పరుగులకి ఆలౌటైంది. దీంతో.. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 15 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని 323 పరుగుల టార్గెట్ ఆస్ట్రేలియా ముందు నిలిచింది. గురువారం ఆరంభమైన ఈ టెస్టులో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులకి ఆలౌటవగా.. ఆస్ట్రేలియా 235కే కుప్పకూలిన విషయం తెలిసిందే.

పుజారా.. మరోసారి అదేస్థాయిలో ఆడటంతో
తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన పుజారా.. మరోసారి అదేస్థాయి ఇన్నింగ్స్ ఆడటంతో మ్యాచ్‌పై భారత్ పూర్తిగా పట్టు సాధించగలిగింది. జట్టు స్కోరు 234 వద్ద పుజారా ఔటవగా.. ఆ తర్వాత వచ్చిన రోహిత్ శర్మ (1: 6 బంతుల్లో) పేలవంగా ఔటయ్యాడు. ఈ ఇద్దరినీ స్పిన్నర్ నాథన్ లియాన్ బుట్టలో వేశాడు. అనంతరం వచ్చిన రిషబ్ పంత్ (28: 16 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సు), అశ్విన్ (5: 18 బంతుల్లో) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఔటవగా.. ఆఖర్లో ఇషాంత్ (0), మహ్మద్ షమీ (0), జస్‌ప్రీత్ బుమ్రా (0) కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు.

త్వరగా ఔట్ చేస్తే భారత్ ఖాతాలో..
ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (44: 67 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సు) ఫర్వాలేదనిపించగా.. మురళీ విజయ్ (18), విరాట్ కోహ్లి (34) మరోసారి నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఆదివారం మరో 52 ఓవర్ల ఆట మిగిలి ఉండగా, రేపు 90 ఓవర్లు ఆస్ట్రేలియా టీం ఆడాల్సి ఉంది. మొత్తంగా 142 ఓవర్లలో మన భారత బౌలర్లు విజృంభించి ఆస్ట్రేలియాని త్వరగా ఔట్ చేస్తే ప్రతిష్టాత్మక విజయం భారత్ ఖాతాలో చేరుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications