Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆదుకున్న విహారీ.. సౌతాఫ్రికా ముందు ట‌ఫ్ టార్గెట్ ఉంచిన టీమిండియా

India set a target of 240 runs ahead of South Africa In 2nd Test

జోహ‌న్నెస్‌బ‌ర్గ్‌: అజింక్య ర‌హానే, చ‌టేశ్వ‌ర్ పుజారా హాఫ్ సెంచరీల‌కు తోడు చివ‌ర్లో తెలుగు కుర్రాడు హ‌నుమా విహారీ ఆదుకోవ‌డంతో రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ముందు టీమిండియా 240 ప‌రుగుల ట‌ఫ్ ల‌క్ష్యాన్ని ఉంచింది. సాధార‌ణంగా జోహ‌న్నెస్ బ‌ర్గ్ పిచ్‌పై టార్గెట్ చేధించ‌డం క‌ష్టంతో కూడుకున్న ప‌ని. దీంతో ఈ ల‌క్ష్యాన్ని భార‌త జ‌ట్టు కాపాడుకుని సిరీస్‌ను గెలుచుకుని చ‌రిత్ర సృష్టిస్తుందా, లేక ల‌క్ష్యాన్ని చేధించి సౌతాఫ్రికా సిరీస్‌ను స‌మం చేస్తుందా అనేది ఆసక్తిక‌రంగా మారింది.

కాగా సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 266 ప‌రుగుల‌కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్‌పై సౌతాఫ్రికా 27 ప‌రుగుల అధిక్యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. భార‌త బ్యాట‌ర్ల‌లో అజింక్యా ర‌హానే( 58 ప‌రుగులు, 8 ఫోర్లు, ఒక సిక్స్‌), చ‌టేశ్వర్ పుజారా(53 ప‌రుగులు, 10 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. చివ‌ర్లో హ‌నుమ విహారి( 40 నాటౌట్.. 6 ఫోర్లు) అద్భుతంగా ఆట తీరుతో ఒంటరి పోరాటం చేసి స‌ఫారీల ముందు ట‌ఫ్ టార్గెట్ ఉంచ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

మిగ‌తా బ్యాట‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ 28, మ‌యాంక్ అగ‌ర్వాల్ 23, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 16, లోకేష్ రాహుల్ 8, జ‌స్ప్రీత్ బుమ్రా 7 ప‌రుగులు చేశారు. రిష‌బ్ పంత్‌, మ‌హ్మ‌ద్ ష‌మీ, మ‌హ్మ‌ద్ సిరాజ్ డ‌కౌట్ అయ్యారు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో ర‌బాడ‌, ఎంగిడి, మార్కో జాన్సెన్ మూడేసి వికెట్లు ప‌డ‌గొట్టారు. ఒలివ‌ర్ ఒక వికెట్ తీశాడు. 85-2తో నేడు ఆట ప్రారంభించిన భార‌త్‌కు వెట‌రన్ ఆట‌గాళ్లు చ‌టేశ్వ‌ర్ పుజారా, అజింక్య ర‌హానే మంచి భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.

IND Vs SA : KL Rahul Lost His Control | KL Rahul vs Dean Elgar| Oneindia Telugu

వీరిద్ద‌రు మూడో వికెట్‌కు 111 ప‌రుగుల సెంచ‌రీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఆ త‌ర్వాత‌ మిగతా బ్యాట‌ర్లు భారీ భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్ప‌క పోవ‌డంతో టీమిండియా భారీ స్కోర్‌ను సాధించ‌లేక‌పోయింది. కాగా అంత‌కు ముందు తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 202 ప‌రుగుల‌కు, సౌతాఫ్రికా 229 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే సౌతాప్రికాలో చ‌రిత్ర ఆవిష్కృత‌మ‌వుతుంది. స‌ఫారీల గ‌డ్డ‌పై తొలి సారి టెస్టు సిరీస్ గెలిచి చ‌రిత్ర సృష్టించింది. ఒక వేళ ఓడినా, లేక డ్రా అయినా సిరీస్ ఫ‌లితం కోసం కేప్‌టౌన్‌లో జ‌ర‌గ‌బోయే మూడో టెస్ట్ మ్యాచ్‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. కాగా గ‌తంలో సౌతాఫ్రికాలో భార‌త జ‌ట్టు ఎప్పుడూ సిరీస్ గెల‌వ‌లేదు.

Story first published: Wednesday, January 5, 2022, 17:58 [IST]
Other articles published on Jan 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+