Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మెరిసిన కేఎల్, సూర్యకుమార్- ఆస్ట్రేలియాకు భారీ టార్గెట్..!!

India set 186 target to Australia in Warm up match during T20 World Cup 2022

బ్రిస్బేన్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న టీమిండియా.. ఆ దేశ జట్టుతో తొలి వామప్ మ్యాచ్ ఆడుతోంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:30 గంటలకు ఆరంభమైన ఈ మ్యాచ్‌లో భారత్ అదర గొడుతోంది. భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్, టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. అర్ధసెంచరీలతో సత్తా చాటారు.

తొలుత కేఎల్..

తొలుత కేఎల్..

టాస్ ఓడిపోయిన తొలుత బ్యాటింగ్‌కు దిగింది టీమిండియా. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్‌ను ఆరంభించారు. ప్రారంభం నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై అటాక్‌కు దిగారు. ప్రత్యేకించి- కేఎల్ రాహుల్ చెలరేగాడు. 27 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు భారీ సిక్సర్లు, ఆరు మెరుపుల్లాంటి ఫోర్లు ఉన్నాయి.

ఒకే ఓవర్‌లో..

ఒకే ఓవర్‌లో..

ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుని పడ్డాడు. 4,0,6,4,2,4తో 20 పరుగులు పిండుకున్నాడు. 7, 8 ఓవర్లల్లో ఆస్ట్రేలియాకు బ్రేక్ త్రూ లభించింది. 7వ ఓవర్ మూడో బంతికి కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో హాఫ్-ట్రాకర్ బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడబోయి అగర్‌కు క్యాచ్ ఇచ్చాడు. 33 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 57 పరుగులు చేశాడు రాహుల్.

తక్కువ పరుగులకే..

తక్కువ పరుగులకే..

ఆ మరుసటి ఓవర్‌లోనే మరో వికెట్ పడింది. అగర్ బౌలింగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు రోహిత్ శర్మ. మిడిల్ స్టంప్ దిశగా దూసుకొచ్చిన బంతిని స్వీప్ చేయబోయి టైమింగ్ మిస్ అయ్యాడు. గాల్లోకి ఎగిన బంతి కాస్తా డీప్ మిడ్ వికెట్‌లో కాచుక్కూర్చున్న మ్యాక్స్‌వెల్ చేతిలో వాలింది. విరాట్ కోహ్లీ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. 13 బంతుల్లో 19 పరుగులు చేసి, మిఛెల్ స్టార్క్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

హార్దిక్ ఫెయిల్..

హార్దిక్ ఫెయిల్..

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విఫలం అయ్యాడు. రెండు పరుగులు మాత్రమే చేశాడు. వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ క్రీజ్‌లో ఉన్నంత సేపు ఫర్వాలేదనిపించుకున్నాడు గానీ.. నిలదొక్కుకోలేకపోయాడు. 14 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 14 పరుగులు చేసి, రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో అవుట్ య్యాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో విజ‌ృంభించాడు. 33 బంతుల్లో ఒక సిక్సర్, ఆరు ఫోర్లతో సరిగ్గా 50 పరుగులు చేసిన సూర్యకుమార్.. చివరి ఓవర్ నాలుగో బంతికి అవుట్ అయ్యాడు.

 నాలుగు వికెట్లతో..

నాలుగు వికెట్లతో..

ఆస్ట్రేలియా బౌలర్లల్లో కేన్ రిచర్డ్‌సన్ ఒక్కడే రాణించాడు. నాలుగు ఓవర్ల కోటాలో 40 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లను పడగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్‌ను పెవిలియన్ దారి పట్టించాడు. మిఛెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అష్టన్ అగర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

Story first published: Monday, October 17, 2022, 11:22 [IST]
Other articles published on Oct 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+