For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌ను తట్టుకోవడానికి దక్షిణాఫ్రికా జనరేషన్ సిద్ధంగా లేదు

India series shows South Africa’s Gen-Next not yet ready: Graeme Smith

హైదరాబాద్: సఫారీ గడ్డపై మొట్ట మొదటిసారి వన్డే సిరీస్‌లలో 3-0తో గెలిచి భారత్, దక్షిణాఫ్రికాలలో క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరినీ ఆశ్యర్యాన్ని నెలకొల్పింది. ఈ పరిణామానికి దక్షిణాఫ్రికా జట్టు మాజీ కెప్టెన్ ఈ విషయమై సఫారీ జట్టు పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు. 'బహుశా ఈ జనరేషన్ భారత్‌ను ఎదుర్కొనేంత సిద్ధపడలేదేమో అనిపిస్తుంది' అని పేర్కొన్నాడు.

భారత్‌ వరుస విజయాలను చూస్తే దక్షిణాఫ్రికా క్రికెట్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ అభిప్రాపడ్డారు. స్విట్జర్లాండ్‌లోని సెయింట్‌ మోర్టిజ్‌లో జరుగుతున్న ఐస్ టీ20 టోర్నీ ఆడేందుకు వచ్చిన స్మిత్‌ మీడియాతో మాట్లాడారు.

'భారత్‌ ఆటగాళ్లు సిరీస్‌లో 3-0తో ఆధిక్యం సాధించడానికి అర్హులు. గాయాలతో దూరమైన కీలక ఆటగాళ్ల స్థానాలు భర్తీ చేయడానికి ప్రొటీస్‌ యువ ఆటగాళ్లు సిద్దంగా లేరనిపిస్తోంది. దీంతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ భవిష్యత్తుపై సందేహం కలుగుతోంది. క్రికెట్‌ సౌతాఫ్రికా సీనియర్‌ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసే దిశగా యువ ఆటగాళ్లను తయారు చేయాలి.' అని తెలిపాడు.

'ఈ ఓటములతో నేను చాలా నిరాశ చెందాను. కానీ క్రెడిట్‌ భారత జట్టుదే. వారు అద్భుతమైన క్రికెట్‌ ఆడారు. సరిగ్గా ప్రపంచకప్‌ ముందే ఇంత పెద్ద సిరీస్‌లో వరుసగా ఓడిపోవడం నిరాశ చెందే విషయమే. గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమవడం మాకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆటగాళ్లు వారి సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవాలి. కనీసం పోరాటపటిమనైన కనబర్చాలని' స్మిత్‌ అభిప్రాయపడ్డారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, February 9, 2018, 16:26 [IST]
Other articles published on Feb 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+