Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియా సిరిస్: టీ20 సిరిస్‌కు హేల్స్ స్ధానంలో బెయిర్‌స్టో

హైదరాబాద్: కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో గాయపడిన ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. జనవరి 26 నుంచి భారత్‌తో జరగనున్న టీ20 సిరిస్‌‌కు అతడి స్ధానంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టోని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది.

ఇంగ్లాండ్‌కు దెబ్బ మీద దెబ్బ: గాయంతో హేల్స్‌ ఇంటికి

వివరాల్లోకి వెళితే గురువారం జరిగిన రెండో వన్డేలో మహేంద్ర సింగ్ ధోని ఇచ్చిన క్యాచ్ పట్టే సమయంలో అతడి కుడి చేతికి గాయమైంది. దీంతో అతడు కోల్‌కతాలో జరగనున్న మూడో వన్డేతో పాటు ఆ తర్వాత జరిగే టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. 28 ఏళ్ల హేల్స్ శనివారం నాడు స్వదేశానికి బయల్దేరనున్నాడు.

India series: Jonny Bairstow replaces Alex Hales in England's T20I squad

ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరిస్‌ జట్టులో ఉన్న బెయిర్ స్టో ఆ తర్వాత జరగనున్న టీ20 సిరిస్‌లో హేల్స్ స్ధానాన్ని భర్తీ చేయనున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ మేరకు టీ20 జట్టులో బెయిర్ స్టో పేరుని జత చేస్తున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ హ్యాండ్లర్‌లో పేర్కొంది.

మూడు వన్డేల సిరిస్‌ను ఇంకో వన్డే మిగిలుండగానే 0-2తో టీమిండియా కైవసం చేసుకుంది. కటక్ వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాను విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురవారం ఓ ప్రకటనలో పేర్కొంది. మరొవైపు స్లో ఓవర్ రేట్‌కు కారణమైన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+