Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ : 627 పరుగులకు ఆలౌట్

చెన్సై: చెన్నై చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో స్టెయిన్ విజృంభణతో భారత తొలి ఇన్నింగ్స్‌కు 627 పరుగుల వద్ద తెరపడింది. స్టెయిన్‌ జోరుకు ఎన్తిని మెరుపులు తోడవడంతో నాలుగోరోజు భారత్ 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్‌కు 87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

భారత ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్ (319) ట్రిపుల్ సెంచరీ చేయగా, ద్రావిడ్ (111), జాఫర్ (73), లక్ష్మణ్ (39)లు రాణించారు. అయితే తక్కిన బ్యాట్స్‌మెన్ తక్కువ పరుగులకే వెనుతిరిగారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్ నాలుగు వికెట్లు సాధించగా, ఎన్తిని, హారీస్‌లు చెరో మూడు వికెట్ల పడగొట్టారు.

అంతకుముందు ఈ టెస్ట్ ప్రారంభంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా జట్టులో ఆమ్లా (159) స్ఫూర్తిదాయకమైన ఆటతో సెంచరీ సాధించి జట్టు బారీ స్కోరుకు బాటలు వేశాడు. మెకెన్‌జీ (94), స్మిత్ (73), బౌచర్ (70)లు సైతం మంచి ఆటతీరు ప్రదర్శించారు.

భారత జట్టులో హర్భజన్ ఐదు వికెట్లు సాధించగా, కుంబ్లే రెండు వికెట్ల పడగొట్టాడు. శ్రీశాంత్, సెహ్వాగ్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Story first published: Saturday, March 29, 2008, 17:16 [IST]
Other articles published on Mar 29, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+