Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జాఫర్ అర్థ సెంచరీ: భారత్ 301 ఆధిక్యం


Dhoniకోల్ కత్తా:పాకిస్తాన్ పై జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్సులో నాలుగవ రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్సు స్కోరుపై భారత్ 301 పరుగుల ఆధిక్యతను సంపాదించింది. ఆట ముగిసే సమయానికి మహేంద్ర సింగ్ ధోనీ 28 పరుగులతో, గంగూలీ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. వేగంగా పరుగులు చేసే ప్రయత్నంలో దినేష్ కార్తిక్, జాఫర్ అవుటయ్యారు. డానిష్ కనేరియా బౌలింగ్‌లోనే వాసిం జాఫర్(54), దినేశ్ కార్తీక్ (28)లు పెవిలియన్ బాట పట్టారు.

అంతకుముందు పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 456 పరుగులు ఆలౌట్ కావడం ద్వారా భారత్‌కు 160 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ జట్టులో మిస్బా ఉల్ హక్ (161 నాటౌట్), కమ్రాన్ అక్మల్ (119), యూనిస్ ఖాన్(43)లు రాణించారు. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ ఐదు వికెట్లు, కుంబ్లే మూడు వికెట్లు పడగొట్టగా, మునాఫ్ పటేల్, లక్ష్మణ్ చెరో వికెట్టు పడగొట్టారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఐదు వికెట్ల నష్టానికి 616 పరుగులు చేసింది. ఆ జట్టులో వాసిం జాఫర్ (202), లక్ష్మణ్ (112), గంగూలీ (102)లు రాణించారు. పాక్ బౌలర్లలో సొహైల్ తన్వీర్, డేనిష్ కనేరియాలు రెండు వికెట్లు పడగొట్టగా, సల్మాన్ భట్ ఓ వికెట్ తీసుకున్నాడు.
Story first published: Monday, December 3, 2007, 23:53 [IST]
Other articles published on Dec 3, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+