Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడే భారత జట్టు ఇదే: తెలుగోడి సత్తా: వద్దనుకున్న వాళ్లే పిలిచి మరీ!

India’s tour of South Africa 2021-22: Team India squad for Tests against South Africa announced by BCCI

ముంబై: దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లబోయే భారత క్రికెట్ జట్టును బీసీసీఐ కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో ఆ దేశ గడ్డపై సుదీర్ఘమైన క్రికెట్‌ను ఆడబోతోంది టీమిండియా. టెస్ట్ మ్యాచ్‌లతో ఈ సిరీస్ ఆరంభం కానుంది. ప్రొటీస్‌తో టెస్టుల్లో ఆడే జట్టు సభ్యులను పేర్లు వెలువడ్డాయి. మొత్తం 18 మందితో కూడిన టెస్ట్ జట్టు.. ఈ పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. వారే కాకుండా మరో నలుగురిని స్టాండ్ బై ప్లేయర్లుగా తీసుకుంది.

 గాయపడ్డ నలుగురికి నో ఛాన్స్..

గాయపడ్డ నలుగురికి నో ఛాన్స్..

ఊహించినట్టే- ఇందులో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. గాయపడ్డ నలుగురు ప్లేయర్లను బీసీసీఐ జట్టులోకి తీసుకోలేదు. వారికి విశ్రాంతి ఇచ్చింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా..ఈ సిరీస్‌కు దూరం అయ్యాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు కూడా జట్టులో చోటు దక్కలేదు. అతను కూడా గాయాలబారిన పడ్డాడు. మరో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ సైతం దక్షిణాఫ్రికా సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.. గాయం వల్ల. రాహుల్ చాహర్‌ను కూడా జట్టులోకి తీసుకోలేదు బీసీసీఐ.

హనుమ విహారికి చోటు..

హనుమ విహారికి చోటు..

తెలుగు క్రికెటర్ హనుమ విహారికి ఈ టెస్ట్ స్క్వాడ్‌లో చోటు కల్పించింది. దక్షిణాఫ్రికాలో పర్యటించిన ఇండియా-ఏ జట్టులో అతను సభ్యుడు. అక్కడు దుమ్ములేపాడు. ఇండియా-ఏ తరఫున ఆడిన మ్యాచ్‌లల్లో భారీ స్కోర్ సాధించగలిగాడు. దీనితో బీసీసీఐ సెలెక్టర్ల దృష్టి మళ్లీ హనుమ విహారిపై పడింది. జట్టులోకి చోటు కల్పించింది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ అతణ్ని తీసుకోలేదు. దీనితో బీసీసీఐ విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ కొరతను భర్తీ చేసేలా దక్షిణాఫ్రికా పర్యటన కోసం హనుమ విహారిని ఎంపిక చేసింది.

 కేప్టెన్‌గా కోహ్లీ..

కేప్టెన్‌గా కోహ్లీ..

టెస్ట్ ఫార్మట్‌ మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ కేప్టెన్‌గా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అతణ్నే ఇక్కడా కంటిన్యూ చేసింది. అదే సమయంలో వన్డే ఇంటర్నేషనల్స్ కేప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీని తప్పించింది. అతని స్థానంలో రోహిత్ శర్మను కేప్టెన్‌గా నియమించింది. దీనితో టీ20 ఫార్మట్‌తో పాటు 50- ఓవర్ల మ్యాచ్‌లకు కూడా రోహిత్ శర్మే కేప్టెన్‌గా ఉంటాడు ఇకపై. దక్షిణాఫ్రికా సిరీస్‌తో కేప్టెన్‌గా అతని కేరీర్ ఆరంభం కానుంది. టెస్ట్ జట్టుకు రోహిత్ శర్మ వైస్ కేప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

 సెంచరీ వీరుకుల చోటు..

సెంచరీ వీరుకుల చోటు..

న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లల్లో సెంచరీలతో కదం తొక్కిన శ్రేయాస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్‌కు జట్టులో చోటు దక్కింది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్‌లో శ్రేయాస్ అయ్యర్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అతనికి అదే తొలి టెస్ట్ మ్యాచ్. డెబ్యూ మ్యాచ్.. తొలి ఇన్నింగ్‌లోనే సెంచరీ బాదేశాడు. ముంబై వాంఖెడె స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్‌లో మయాంక్ అగర్వాల్ సెంచరీ సాధించాడు. వారిద్దరికీ జట్టులో చోటు దక్కింది.

కేఎస్ భరత్‌కు మొండిచెయ్యి..

కేఎస్ భరత్‌కు మొండిచెయ్యి..

తెలుగు కుర్రాడు కోన శ్రీకర్ భరత్‌కు మొండిచెయ్యి చూపింది బీసీసీఐ. వాంఖెడె స్టేడియంలో వృద్ధిమాన్ సాహా గాయపడిన సమయంలో సబ్‌స్టిట్యూట్‌గా ఆడాడు కేఎస్ భరత్. అద్భుతంగా రాణించాడు. మెరుపు వేగంతో వికెట్ల వెనుక కదిలాడు. అతనికి దక్షిణాఫ్రికాకు వెళ్లే జట్టులో చోటు దక్కుతుందని అందరూ భావించారు. దీనికి భిన్నంగా నిర్ణయాన్ని తీసుకుంది బీసీసీఐ. అనుభవం లేకపోవడం వల్లే భరత్‌ను తీసుకోలేదని తెలుస్తోంది. దక్షిణాఫ్రికా జట్టును ఆ దేశ గడ్డపై ఎదుర్కొనే అనుభవం భరత్‌ కంటే వృద్ధిమాన్ సాహాకే ఉన్నందున అతని వైపు మొగ్గు చూపింది.

జట్టు ఇదీ:

జట్టు ఇదీ:

విరాట్ కోహ్లీ (కేప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కేప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్. స్టాండ్ బై ప్లేయర్లు- నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, ఆర్జన్ నగ్వాస్‌వాలా.

Story first published: Wednesday, December 8, 2021, 20:45 [IST]
Other articles published on Dec 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+