
హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే దక్షిణాఫ్రికా పర్యటన కోహ్లీసేనకు నిజమైన సవాల్ అని టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా సత్తా ఏంటో తెలుస్తుందని కైఫ్ ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు. విదేశాల్లో మ్యాచ్‌లంటేనే భారత క్రికెటర్లకు ఓ కఠినపరీక్షలాంటిందని కైఫ్ అన్నాడు. గత విదేశీ పర్యటనలను గనుక పరిశీలిస్తే టీమిండియాకు అద్భుతమైన బ్యాటింగ లైనప్ ఉందని, బౌలర్లే విఫలమవుతుంటారని కైఫ్ అన్నాడు. అయితే, ప్రస్తుతం భువీ, ఉమేశ్, షమీలాంటి బౌలర్లతో భారత బౌలింగ్ పటిష్టంగా ఉందని, ఏమవుతుందో చూడాలని అన్నాడు.