టీ20 వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా ఆడబోయే టీ20 సిరిస్‌ల వివరాలివే

హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 18, 2020 నుంచి నవంబర్ 15 వరకు ఈ వరల్డ్‌కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 దేశాలు పాల్గొంటున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌కు సన్నాహాకాల్లో భాగంగా అన్ని దేశాలు టీ20 సిరిస్‌లను ఆడుతున్నాయి.
ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీమిండియా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడుతోంది. ఆదివారంతో ముగిసిన ఈ టీ20 సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. కాగా, వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా ఆడబోయే టీ20 సిరిస్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.

బంగ్లా తర్వాత భారత పర్యటనకు విండిస్ జట్టు
షెడ్యూల్‌లో భాగంగా టీమిండియా ఈ ఏడాది డిసెంబర్‌లో వెస్టిండిస్‌తో సొంతగడ్డపై మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఆ తర్వాత జనవరిలో శ్రీలంకతో సొంతగడ్డపై మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. అదే జనవరి చివర్లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరిస్ ఆడనుంది.

లంకలో లంకతో మూడు టీ20ల సిరిస్
అనంతరం శ్రీలంకలో లంకపై మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఈ పర్యటన జూన్ 2020లో జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్‌లో సుమారు ఐదు నుంచి ఏడు టీ20ల్లో పాల్గొంటుంది. ఇక, టీ20 వరల్డ్‌కప్‌కు సరిగ్గా నెలరోజుల ముందు అంటే అక్టోబర్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో చెరో మూడు టీ20ల్లో తలపడనుంది.

టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ ఇదే
కాగా, ఇటీవలే క్వాలిఫయిర్ టోర్నీకి సంబంధించిన అన్ని మ్యాచ్‌లు ముగియడంతో టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ని ఐసీసీ విడుదల చేసింది. టోర్నీలో తొలి మ్యాచ్ శ్రీలంక, ఐర్లాండ్ మధ్య అక్టోబర్ 18న జరుగుతుంది. ఇక, భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబరు 24న దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. రెండో మ్యాచ్‌లో 29న క్వాలిఫయింగ్ జట్టుతో తలపడుతుంది.

నవంబర్ 15న మెల్‌బోర్న్‌లో ఫైనల్
క్వాలిఫైయర్ మ్యాచ్‌లు అక్టోబర్ 24 నుంచి నవంబర్ 8 వరకు జరగనుండగా.. సెమీఫైనల్స్ నవంబర్ 11, 12 తేదీల్లో జరుగుతాయి. నవంబర్ 15న మెల్‌బోర్న్‌లో ఫైనల్ నిర్వహిస్తారు. కాగా, సూపర్-12 దశలో టీమిండియా ఐదు మ్యాచుల్లో తలపడనుంది.

టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆడే ఏదు మ్యాచ్‌లివే
* భారత్ vs దక్షిణాఫ్రికా: అక్టోబర్ 24, శనివారం సాయంత్రం 4:30
* భారత్ vs అర్హత జట్టు: అక్టోబర్ 29, గురువారం మధ్యాహ్నం 1:30
* భారత్ vs ఇంగ్లాండ్: నవంబర్ 1, ఆదివారం మధ్యాహ్నం 1:30
* భారత్ vs అర్హత జట్టు: నవంబర్ 5, గురువారం మధ్యాహ్నం 2:00
* భారత్ vs అఫ్గానిస్థాన్: నవంబర్ 8, ఆదివారం మధ్యాహ్నం 1:30
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications