Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువీకి మొండిచెయ్యి, అశ్విన్‌కు విశ్రాంతి: వన్డే జట్టు ఇదే

ముంబై: ఈనెల 16న నుంచి భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఐదు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా వన్డే జట్టును ఎంపిక చేసేందుకు గురువారం టీమిండియా సెలక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో భాగంగా తొలి మూడు వన్డేలకు సెలక్షన్ కమిటీ భారత జట్టును గురువారం సాయంత్రం ప్రకటించింది.

చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కొత్త సెలక్షన్ కమిటీ తొలిసారి గురువారం సమావేశమై 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరిస్‌లో ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌కు నిరాశ ఎదురైంది. అతడికి సెలక్టర్లు మొండి చెయ్యి చూపారు.

India's squad for 1st 3 ODIs against New Zealand announced; Yuvraj ignored, Ashwin rested

ఇర్ఫాన్ పఠాన్, స్టువర్ట్ బిన్నీలకు కూడా నిరాశే ఎదురైంది. కొత్తగా జట్టులోకి జయంత్ యాదవ్‌కు చోటు కల్పించారు. రవీంద్ర జడేజా, అశ్విన్, మహ్మద్ షమీకి విశ్రాంతి నిచ్చారు. సురేశ్ రైనా, మన్ దీప్, కేదార్ జాదవ్, హార్థిక్ పాండ్యాలకు జట్టులో చోటు కల్పించారు.

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డే అక్టోబర్ 16న ధర్మశాలలో జరగనుంది. చివరి మ్యాచ్ అక్టోబర్ 29న విశాఖపట్నంలో జరగనుంది.

Here is the 15-member Men In Blue squad:

1. ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్)
2. రోహిత్ శర్మ
3. విరాట్ కోహ్లీ
4. మనీష్ పాండే
5. అజింక్య రహానె
6. సురేష్ రైనా
7. హార్ధిక్ పాండ్య
8. అక్షక పటేల్
9. బుమ్రా
10. జయంత్ యాదవ్
11. ధావల్ కులకర్ణి
12. ఉమేష్ యాదవ్
13. అమిత్ మిశ్రా
14. కేదార్ జాదవ్
15. మన్దీప్ సింగ్

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+