
హైదరాబాద్: అంతర్జాతీయ ఆటగాళ్లు రిషబ్ పంత్, రషీద్ ఖాన్‌ల మధ్య చోటు చేసుకున్న సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కి ముందు పంత్, రషీద్ గ్రౌండ్‌లో సరదాగా ఎంజాయ్ చేశారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
రిషబ్ పంత్ పిచ్‌ను పరీక్షిస్తున్న సమయంలో సన్‌రైజర్స్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్.... పంత్‌ను ఆటపట్టిస్తూ చక్కిలిగింతలు పెట్టాడు. ఈ క్రమంలో ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో రిషభ్ పంత్, రషీద్ ఖాన్ ఏం మాట్లాడుకుంటున్నారో ఊహించండి అంటూ కామెంట్ పేట్టింది.
ఇదిలా ఉంటే, మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తాజా విజయం సన్‌రైజర్స్‌కు వరుసగా మూడో విజయం కాగా... ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 130 పరుగుల విజయ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి చేధించింది.