ప్రతికూలత పరిస్థితుల్లోనూ బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు గెలిచిన జోరు, న్యూజిలాండ్‌పై మెరుగైన రికార్డుతో.. మూడు టెస్టుల సిరీస్‌ను ఘనంగా ఆరంభించాలని భారత్ ఉత్సాహంతో బరిలోకి దిగింది. కానీ బెంగళూరు టెస్టులో ఊహించని పరాభవం. టీమిండియాపై కివీస్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అంతేగాక సొంతగడ్డపై పటిష్టమైన రోహిత్‌సేనను 46 పరుగులకే కుప్పకూల్చింది.
అయితే టెస్టు సిరీస్‌ను నిలుపుకోవాలంటే గురువారం నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టులో భారత్ తప్పక సత్తాచాటాలి. కివీస్‌ను చిత్తు చేసి సిరీస్‌పై గురిపెట్టాలి. ఈ నేపథ్యంలో పుణె టెస్టుకు తుదిజట్టులో మార్పులు చేయాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నారు. అంతేగాక స్పిన్ పిచ్‌తోనూ ప్రత్యర్థికి కళ్లెం వేయాలని వ్యూహాలు రచిస్తున్నారు.

కేఎల్ రాహుల్‌పై వేటు
మెడనొప్పితో శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ బెంగళూరు టెస్టులో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైనప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు సాధించాడు. ఈ కీలక ఇన్నింగ్స్ తర్వాత సర్ఫరాజ్‌ను తుదిజట్టు నుంచి తప్పించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కేఎల్ రాహుల్‌ను తప్పించి సర్ఫరాజ్‌ను జట్టులో కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే గిల్ పూర్తిగా కోలుకోకపోతే మాత్రం రాహుల్‌కు అవకాశం ఇవ్వనుంది. కాగా, బెంగళూరు టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులు చేశాడు.

కుల్‌దీప్ స్థానంలో అక్షర్
బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత బలోపేతం చేయడానికి కుల్‌దీప్ యాదవ్ స్థానంలో ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలని భారత జట్టు యాజమాన్యం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ పుణె టెస్టులో తుదిజట్టులోకి రానున్నాడు. అక్షర్ బంతితో పాటు బ్యాటుతోనూ సత్తాచాటగలడు. అయితే తొలి టెస్టులో కుల్‌దీప్ మూడు వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
కాగా, రిషభ్ పంత్‌కు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు అందుకోనున్నాడు. రాహుల్‌కు గ్లవ్స్ అందించి వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకునే ప్లాన్-బీని కూడా గంభీర్-రోహిత్ కలిగి ఉన్నారు. మొదటి టెస్టు ఓటమి వాషింగ్టన్ సుందర్ జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే.

తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్/ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్.