Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG VS AUS: ఇంగ్లాండ్-ఆసీస్ మ్యాచ్‌లో బిగ్ మిస్టేక్.. పాకిస్థాన్ గడ్డపై భారత జాతీయ గీతం!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలోని అగ్రశ్రేణి జట్లైన ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ హోరాహోరీగా తలపడుతున్నాయి. లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా ఈ పోరు సాగుతోంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి అడుగు ముందుకు వేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

భారత జాతీయ గీతం..
అయితే ఈ మ్యాచ్ టాస్ సమయంలో ఓ చిన్న తప్పిదం జరిగింది. సాధారణంగా మైదానంలో ఆడుతోన్న మ్యాచ్ ప్లేయర్లు.. ఆట ప్రారంభానికి ముందు తమ దేశ జాతీయ గీతాన్ని ఆలపించడం సంప్రదాయం. అదే సమయంలో ఆయా దేశాల జాతీయ గీతాన్ని బ్యాక్ గ్రౌండ్ లోనూ ప్లే చేస్తుంటారు. కానీ ఆసీస్ - ఇంగ్లాండ్ మ్యాచ్ లో అనుకోకుండా భారత జాతీయ గీతాన్ని ప్లే చేసేశారు. మొదట ఇంగ్లాండ్ జాతీయ గీతాన్ని ప్లే చేయగా.. అనంతరం ఇండియన్ నేషనల్ యాంథమ్ ను ప్లే చేశారు. కానీ ఆ వెంటనే సెకన్ల వ్యవధిలో మళ్లీ ఆస్ట్రేలియా నేషనల్ యాంథమ్ ను ప్లే చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు పాక్ గడ్డపై భారత జాతీయ గీతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Champions Trophy 2025 India s National Anthem Played By Mistake in Australia-England Clash

కాగా,ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు దిగింది. ప్రస్తుతానికి ఇంగ్లీష్ జట్టు 11 ఓవర్ల సమయానికి 2 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా తుది జట్టు :
మ్యాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కేరీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వారిషూస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్

ఇంగ్లాండ్ తుది జట్టు :
ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, మార్క్ వుడ్

Story first published: Saturday, February 22, 2025, 15:32 [IST]
Other articles published on Feb 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+