Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అత్యుత్తమ ఫీల్డింగ్ జట్లలో భారత్ ఒకటి: సచిన్

హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డింగ్ జట్లలో టీమిండియా ఒకటని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ కోల్ కతా పుల్ మారథాన్‌లో పాల్గొనేందుకు కోల్‌కతాకు వచ్చిన సచిన్ టెండూల్కర్ మీడియాతో మాట్లాడాడు.

టీమిండియా ఫీల్డింగ్‌ను చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంటుందని తెలిపాడు. ఫీల్డింగ్ చేసే సమయంలో టీమిండియా ఆటగాళ్లు ఎంతో దూకుడుగా వ్యవహరిస్తాడని సచిన్ పేర్కొన్నాడు. మన రోజువారీ ఫిట్‌నెస్ భిన్నంగా ఉంటుందని చెప్పిన సచిన్, ప్రస్తుత ఆటగాళ్లు ఫిట్‌నెస్ ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తున్నాడని చెప్పాడు.

India's fielding is 'one of the best in the world': Sachin Tendulkar

అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అద్భుతమైన ఫీల్డింగ్‌తో పాటు శరీరకంగా, మానసికంగా ధృడంగా ఉండాలని అన్నాడు. మనం ఫిట్‌గా ఉన్నప్పుడే ప్రాక్టీస్ కూడా చేయలమని సచిన్ తెలిపాడు. ప్రాక్టీస్ చేయకుండా ఏమీ సాధించలేని చెప్పాడు.

ఫిట్‌నెస్ విషయంలో ప్రత్యకేమైన శ్రద్ధను కనబర్చడంతో పాటు ప్రతి రోజూ హార్డ్ వర్క్ చేయాలని సచిన్ సూచించాడు. మన ఆరోగ్యమే మన సంపద అని చెప్పిన సచిన్ తన చిన్నతనంలో నాయనమ్మ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+