సిరీస్ గెలిచేందుకు భారత్‌కు 30శాతం మాత్రమే ఛాన్స్

హైదరాబాద్: భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ తనదైన స్థాయిలో భారత్ పుంజుకోవడానికి కేవలం ముప్పై శాతం మాత్రమే అవకాశాలున్నాయని అంటున్నాడు. దక్షిణాఫ్రికా జట్టుతో తొలి టెస్టులో భాగంగా భారత్ ఆడి 72 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే.
పరాజయం అనంతరం టీమిండియాను అందరూ విశ్లేషించటం మొదలెట్టారు. కొందరు సలహాలిస్తుంటే సెహ్వాగ్ మాత్రం ఇంకొంచెం ముందు చూపుతో వ్యవహరిస్తున్నాడు. జట్టు గెలవాలంటే అవకాశాలు కేవలం 30శాతమే ఉన్నాయంటూ తేల్చి చెప్తున్నాడు.
'ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి చూస్తే భారత్‌కు కేవలం ముప్పై శాతం మాత్రమే అవకాశాలు ఉన్నాయి. మళ్లీ పునర్వైభవాన్ని తెచ్చుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. సెంచూరియో వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కు అనుకూల మైదానం' అంటూ పేర్కొన్నాడు.
ఇంతేగాక, కోహ్లీసేన ఆరుగురు బ్యాట్స్ మెన్‌లతో కలిపి నలుగురు బౌలర్లతో ఆడితే బాగుంటుందంటూ అభిప్రాయపడ్డాడు. ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్‌గా అజింకా రహానేను తీసుకోవాల్సిందంటూ సూచించాడు. రెండో టెస్టులో భారత్ నెగ్గాలంటే విరాట్, రోహిత్‌లే ఎక్కువ బాధ్యత మోయాలి అంటూ ముగించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications