ఆస్ట్రేలియా రికార్డు బద్దలు
ఈ క్రమంలో టీమిండియా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. రాంచీ టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు పేరిట ఉన్న రికార్డుని బద్దలు కొట్టింది. స్వదేశంలో అత్యధిక టెస్టు సిరిస్ విజయాలను నమోదు చేసిన జట్టుగా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా రికార్డును కోహ్లీసేన అధిగమించింది.

2000-01 సీజన్ వరకూ
1994-95 సీజన్ మొదలు కొని 2000-01 సీజన్ వరకూ ఆస్ట్రేలియా సొంతగడ్డపై వరుసగా 10 టెస్టు సిరిస్ విజయాలను నమోదు చేసింది. ఆ తర్వాత 2004-09 సీజన్ మధ్యలో ఆస్ట్రేలియా మరోసారి 10 వరుస స‍్వదేశీ టెస్టు సిరీస్ విజయాలు సాధించింది. అయితే, ఇప్పుడు ఆ రికార్డుని టీమిండియా బద్దలు కొట్టింది.

2012-13 సీజన్ నుంచి
2012-13 సీజన్ నుంచి ఇప్పటివరకూ భారత్ వరుసగా 11 టెస్టు సిరీస్ విజయాల్ని నమోదు చేసింది. ఈ జాబితాలో టీమిండియా, ఆస్ట్రేలియాల తర్వాత స్థానంలో వెస్టిండిస్ ఉంది. 1975-76 సీజన్ నుంచి 1985-86 సీజన్ వరకూ వెస్టిండిస్ తమ సొంత గడ్డపై వరుసగా ఎనిమిది టెస్టు సిరీస్ విజయాలు నమోదు చేసింది.

టీమిండియా స్వదేశంలో సాధించిన టెస్టు సిరీస్ విజయాలు:
ఇండియా vs దక్షిణాఫ్రికా 2019: 3-0 * (3)
ఇండియా vs వెస్టిండీస్ 2018: 2-0 (2)
ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ 2018: 1-0 (1)
ఇండియా vs శ్రీలంక 2017: 1-0 (3)
ఇండియా vs ఆస్ట్రేలియా 2017: 2-1 (4)
ఇండియా vs బంగ్లాదేశ్ 2017: 1-0 (1)
ఇండియా vs ఇంగ్లాండ్ 2016: 4-0 (5)
ఇండియా vs న్యూజిలాండ్ 2016: 3-0 (3)
ఇండియా vs దక్షిణాఫ్రికా 2015: 3-0 (4)
ఇండియా vs వెస్టిండీస్ 2013: 2-0 (2)
ఇండియా vs ఆస్ట్రేలియా 2013: 4-0 (4)


Click it and Unblock the Notifications












