Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరుసగా మూడో ఏడాది టెస్ట్ గదను సొంతం చేసుకున్న కోహ్లీసేన

India retain Test mace for third consecutive year

హైదరాబాద్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా వరుసగా మూడో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది. ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి 116 పాయింట్లతో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అగ్రస్థానంలో నిలిచి వరుసగా మూడో ఏడాది ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గదతో పాటు మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

టీమిండియా చివరగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక, 108 పాయింట్లతో న్యూజిలాండ్‌ రెండో స్థానంలో నిలిచింది. గతేడాది టీమిండియా సఫారీ గడ్డపై టెస్టు సిరిస్‌ను 1-2తో చేజార్చుకుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో 1-4తో టెస్టు సిరిస్‌ను కోల్పోయింది.

ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో

ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో

ఆ తర్వాత సొంతగడ్డపై ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో విజయం సాధించిన టీమిండియా... వెస్టిండిస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. చివరగా ఆసీస్ గడ్డపై 2-1తో టెస్టు సిరిస్‌ను నెగ్గి కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఆసీస్ గడ్డపై తొలి టెస్టు సిరిస్ నెగ్గిన ఆసియా జట్టుగా అరుదైన ఘనత సాధించింది.

వరుసగా మూడో ఏడాది కూడా

వరుసగా మూడో ఏడాది కూడా

టెస్టు ర్యాంకుల్లో వరుసగా మూడో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలవడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "మరోసారి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. అన్ని ఫార్మాట్లలోనూ మన జట్టు చక్కని ప్రదర్శన చేస్తోంది" అని అన్నాడు.

టెస్టు ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని

టెస్టు ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని

"అయితే, టెస్టు ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం కాస్త ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. టెస్టు క్రికెట్‌ ప్రాముఖ్యత మనకు తెలుసు. బాగా రాణించిన వారే ముందుకు వెళ్తారు" అని కోహ్లీ వెల్లడించాడు. ఇక, రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు 5లక్షల డాలర్ల ప్రైజ్‌మనీని లభించనుంది.

రెండో స్థానంలో నిలవడం సంతోషం

రెండో స్థానంలో నిలవడం సంతోషం

ఈ సందర్భంగా తమ జట్టు ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలవడం సంతోషంగా విలియమ్సన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక గత రెండేళ్లుగా రెండో స్థానంలో కొనసాగిన దక్షిణాఫ్రికా జట్టు ఈసారి 105 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. ఆ జట్టుకు 2లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ రాగా, ఇంగ్లాండ్‌ 104 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి లక్ష డాలర్లను సొంతం చేసుకున్నాయి.

Story first published: Monday, April 1, 2019, 18:52 [IST]
Other articles published on Apr 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+