Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్ట్ ర్యాంకింగ్స్: మళ్లీ నెం.1గా టీమిండియా

దుబాయ్‌: టీమిండియా అధికారికంగా టెస్టుల్లో నెంబర్ 1 ర్యాంక్‌ను పొందింది. నాలుగున్నరేళ్ల తర్వాత తిరిగి అగ్రస్థానాన్ని అధిరోహించింది. మంగళవారం దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టు సిరీస్‌ ముగిసిన నేపథ్యంలో ఐసీసీ.. టెస్టు ర్యాంకింగ్స్‌ను సవరించింది.

తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో 110 రేటింగ్‌ పాయింట్లతో భారత జట్టు అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా (109) రెండో స్థానం దక్కించుకుంది. దశాంశాల్లో తేడా కారణంగా దక్షిణాఫ్రికా (109) మూడో స్థానానికి పడింది.

India regain No. 1 Test ranking, South Africa slip to third

పాకిస్థాన్‌ (106), ఇంగ్లాండ్‌ (102), న్యూజిలాండ్‌ (99), శ్రీలంక (89), వెస్టిండీస్‌ (76), బంగ్లాదేశ్‌ (47), జింబాబ్వే (5) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టీమిండియా నిరుడు డిసెంబరులో దక్షిణాఫ్రికాను 3-0తో ఓడించి.. రెండో ర్యాంక్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఇంగ్లాండ్‌ 2-1తో సఫారీ జట్టును ఓడించిన నేపథ్యంలో టీమిండియా నెం.1 ర్యాంక్‌కు ఎగబాకింది. 2011 ఆగస్టు తర్వాత ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి. అప్పుడు ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ఓటమితో భారత్‌ నెం.1 ర్యాంక్‌ నుంచి కిందకు పడింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+