వన్డేల్లో కోహ్లీసేనకు ఒకటో ర్యాంకు వచ్చింది కానీ!
హైదరాబాద్: ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. భారత్‌కు ఇది వరుసగా తొమ్మిదో వన్డే విజయం కావడం విశేషం. అంతేకాదు ఇండోర్‌లో సాధించిన ఒక్క విజయం కోహ్లీసేనకు రెండు ఘనతలను తెచ్చిపెట్టింది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానం కైవసం చేసుకోవడంతో పాటు.. ఆస్ట్రేలియాపై ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానం సాధించినప్పటికీ.. అది పదిలం కాదు. చివరి రెండు వన్డేల్లో ఓడితే రెండో స్థానానికి పరిమితం కావాల్సి ఉంటుంది.

120 పాయింట్లతో అగ్రస్ధానంలోకి
ఆదివారం వరకు 119 పాయింట్లతో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు భారత్ ఖాతాలో 120 పాయింట్లు వచ్చి చేరాయి. ఇక ఈ స్థానాన్ని మరింతకాలం పాటు కాపాడుకోవాలంటే కోహ్లీసేన, ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించాల్సి ఉంది. అలా సాధించని పక్షంలో దక్షిణాఫ్రికానే తిరిగి నెంబర్ వన్ అవుతుంది.

త్వరలో దక్షిణాఫ్రికా జట్టు బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్
ఎందుకంటే, త్వరలో దక్షిణాఫ్రికా జట్టు బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఆసీస్‌తో సిరిస్‌లో భారత్ మరొక్క మ్యాచ్ మాత్రమే గెలిస్తే, దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ టీమిండియా రెండు మ్యాచ్‌లూ గెలిస్తే మాత్రం 122 పాయింట్లతో అగ్రస్ధానంలో నిలుస్తుంది. అప్పుడు దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్‌ను 2-1 తేడాతో ఓడించినా, 3-0 తేడాతో ఓడించినా భారత ర్యాంకుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

114 పాయింట్లతో మూడో స్థానానికి
ఇక ఆసీస్ విషయానికి వస్తే, రెండో ర్యాంకుతో భారత్ పర్యటనకు వచ్చి ఇప్పుడు 114 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. ఇక మిగతా మ్యాచ్‌లు ఓడినా, గెలిచినా వారి ర్యాంక్ మారదు. నెంబర్ వన్ ర్యాంకు కోసం ఆసీస్‌తో ఐదు వన్డేల సిరిస్‌లో నాలుగు మ్యాచ్‌లు నెగ్గాల్సిన టీమిండియా ఇప్పటికే మూడు విజయాలు సాధించేసింది.

భారత్ గెలవడం ఇదే తొలిసారి
ఇక చివరి రెండు వన్డేల్లో ఏ ఒక్కటి నెగ్గినా టీమిండియా తన అగ్రస్ధానాన్ని పదిలం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే టెస్టుల్లో గతేడాది నుంచి కోహ్లీసేన అగ్రస్ధానంలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో ఆసీస్‌పై మిగిలిన ఏకైక లక్ష్యం.. క్లీన్‌స్వీప్ మాత్రమే. ఆసీస్‌పై ఐదు వన్డేల సిరీస్‌ను రెండు మ్యాచ్‌లుండగానే భారత్ గెలవడం ఇదే తొలిసారి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications