పింక్ బాల్‌తో ఆ దేశంలో ఆడేందుకు సిద్ధం కానీ కండీషన్స్ అప్లై: కోహ్లీ

కోల్‌కతా: డే అండ్ నైట్ టెస్టుకు భారత్ సన్నద్ధమవుతోంది. ఎక్కడ చూసిన క్రీడాభిమానులు తొలిసారిగా జరుగుతున్న ఈ టెస్టు గురించే చర్చించుకుంటున్నారు. భారత్‌లో జరిగే తొలి డే అండ్ నైట్ టెస్టు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత డే అండ్ నైట్ టెస్టులు ఆడేందుకు భారత్ ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు కోల్‌కతాలో జరిగే టెస్టు మ్యాచ్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంట్రెస్టంగ్ కామెంట్స్ చేశారు.

ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటే ఆస్ట్రేలియాలో ఆడతాం
నవంబర్ 22న భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య కోల్‌కతాలోని చారిత్రాత్మక మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ గేమ్‌లో పింక్‌బాల్‌ను వినియోగించనున్నారు. అయితే గతేడాది అడిలైడ్‌లో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ను పింక్ బాల్‌తో ఆడేందుకు భారత్ నిరాకరించింది. అయితే ఆ తర్వాత జరిగిన అన్ని డే అండ్ నైట్ టెస్టు మ్యాచుల్లో ఈ పింక్‌బాల్‌నే వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాము ఆస్ట్రేలియాలో పింక్‌బాల్‌తో డేనైట్ టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని అయితే అంతకంటే ముందు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించాలని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. 2018-19లో ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించినప్పుడు అప్పటికప్పుడు డే నైట్ టెస్టు మ్యాచ్ అని చెప్పడంతో దానికి ప్రిపేర్ అవ్వలేకపోయామని రన్ మెషీన్ విరాట్ చెప్పారు. అప్పటి వరకు ఒక్కసారి కూడా పింక్ బాల్‌తో ఆడలేదన్న విషయాన్ని గుర్తు చేశాడు.

డే నైట్ టెస్టు భారత క్రికెట్ చరిత్రలో మరో అధ్యాయం
ఇదిలా ఉంటే డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లు ఆడిన దేశాల్లో భారత్ 9వ దేశంగా నిలిచింది. బంగ్లాదేశ్ కూడా తొలిసారిగా డే అండ్ నైట్ టెస్టు మ్యాచుల్లో ఆడనుంది. ఓ వారంరోజుల్లో మ్యాచ్ ఉందనగా.. రెండు రోజుల ముందర పింక్ బాల్‌తో ఆడుతున్నామని చెప్పడం సరికాదన్నాడు విరాట్ కోహ్లీ. అప్పటి వరకు రెడ్ కలర్ బాల్‌కు అలవాటు పడిపోయిన ప్లేయర్లు ఒక్కసారిగా పింక్ కలర్‌కు మారాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుందని చెప్పాడు. ఒక్కసారి ఆడటం ప్రారంభించి దానికి అలవాటు పడితే ఇక ఎప్పుడైనా సరే ఆడగలమని విరాట్ చెప్పాడు. ఇక భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య జరగబోయే డే అండ్ నైట్ టెస్టును భారత క్రికెట్‌లో చారిత్రాత్మక ఘట్టంగా నిలవబోతోందని చెప్పాడు.
పింక్ బాల్‌తో ఆడటం కొత్త ఉత్సాహాన్నిస్తోంది
పింక్ బాల్‌తో టెస్టు మ్యాచ్ ఆడటం అదికూడా ఫ్లడ్‌లైట్ల కింద ఆడటం నిజంగానే ఉత్సాహాన్ని ఇస్తోందని చెప్పాడు విరాట్ కోహ్లీ.అదేసమయంలో పింక్‌బాల్‌తో ఆడటం సవాలుతో కూడిన పని అని చెప్పాడు. ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా భారత్ క్రికెట్లో నిలిచిపోతుందని వెల్లడించాడు. ఇక ఫీల్డింగ్ సమయంలో పింక్‌బాల్‌తో కాస్త ఇబ్బందిగానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు విరాట్ కోహ్లీ. సాధారణంగా పింక్‌బాల్‌ను పట్టుకుని చూడగా రెడ్ బాల్‌కంటే కాస్త బరువు ఉన్నట్లుగా అనిపించిందని చెప్పాడు. కానీ రెండు బంతుల బరువు ఒకేలా ఉంటుందని చెప్పాడు. ప్రాక్టీస్ సందర్భంగా స్లిప్ క్యాచులు తీసుకుంటున్న సమయంలో బాలు చేతికి బలంగానే తాకుతోందని చెప్పాడు. ఇక బౌండరీ లైన్ నుంచి పిచ్ వరకు బాల్‌ను విసిరేందుకు ఆటగాళ్లు మరింత బలాన్ని వినియోగించాల్సి వస్తోందని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications