Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిసలైన పరీక్షకు సిద్ధంగా ఉన్నాం: లంక విజయానంతరం రోహిత్

India ready for overseas challenges, says Rohit Sharma after ODI series win over Sri Lanka

హైదరాబాద్: రాబోయే 18 నెలలు టీమిండియా సత్తాకు అసలు సిసలైన పరీక్షగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. అయితే దానినిఅధిగమించి విజయాల్ని సాధించడానికి టీమిండియా సిద్దంగా ఉందని స్పష్టం చేశాడు.

విశాఖ వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. వన్డేల్లో టీమిండియాకు వరుసగా ఇది ఎనిమిదవ సిరిస్ కాగా, కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది వన్డే సిరిస్ విజయం కావడం విశేషం.

జనవరి, 2016 నుంచి జరిగిన ద్వైపాక్షిక సిరిస్‌లలో టీమిండియా ఓడిపోలేదు. ఇందులో ఆరు సిరిస్‌లు స్వదేశంలో కాగా, రెండు సిరిస్‌లు బయట గెలిచింది. ఈ ఏడాది మొదట్లో వెస్టిండిస్, ఆ తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లిన కోహ్లీసేన అక్కడ 5-0తో వన్డే సిరిస్‌ను కైవసం చేసుకుంది.

మూడో వన్డే అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ 'ధర్మశాలలో జరిగిన తొలి వన్డే తర్వాత అద్భుతంగా పుంజుకున్నాం. అందరూ గొప్పగా రాణించారు. అది నాకు కెప్టెన్‌గా కూడా పరీక్షగా నిలిచింది. తీవ్ర ఒత్తిడిలోనూ నెగ్గుకురావడమే ఈ జట్టు ప్రత్యేకత. రెండో వన్డేలో కావాల్సినన్ని పరుగులు చేశాం' అని అన్నాడు

'ఇక రెండో వన్డే మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన మ్యాచ్‌. భారీ పరుగులు సాధించి లంకను ఛాలెంజ్‌ చేశాం. అది మాకు ఫర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌. మూడో వన్డేలో కూడా సమష్టిగా రాణించి సిరీస్‌ను సాధించాం. వికెట్లు సాధించే బౌలర్లు ఉండటం వల్ల కెప్టెన్‌గా నా పని ఈజీ అయ్యింది. వారి సామర్థ్యంతో లంకను కట్టడి చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాం' అని పేర్కొన్నాడు.

'బౌలర్లు నా పని సులభం చేసి మ్యాచ్‌లో గెలుపును అందించారు. ఈ తరహా బౌలర్లు ఉంటే కెప్టెన్‌గా ఎటువంటి ఒత్తిడి ఉండదు. ముఖ్యంగా కుల్దీప్, చాహల్‌లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరిస్‌లలో ఏ విధంగా రాణించారో, అదే విధంగా లంక సిరిస్‌లో అద్భుత ప్రద్శరన చేశారు. కెప్టెన్‌గా నిలదొక్కుకోడానికి ఆ మ్యాచ్‌ ఉపయోగపడింది' అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.

ఇక, జనవరిలో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. దీనిపై రోహిత్ శర్మ మాట్లాడుతూ 'మేము విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నాం. జట్టుకు రాబోయే ఏడాదిన్నర ఛాలెంజ్‌గా ఉంటుంది, అందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం' అని రోహిత్ శర్మ తెలిపాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 18, 2017, 13:34 [IST]
Other articles published on Dec 18, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+