For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ind vs SL: శ్రీ‌లంకతో టెస్టు సిరీస్‌ క్లీన్‌స్వీప్.. WTC పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా స్థానం మెరుగు

India reach the fourth place in World Test Championship points table 2021-2023
IND VS SL: Team India's 15th Consecutive Test Series Win At Home | Oneindia Telugu

శ్రీ‌లంక‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ 2021-2023 పాయింట్స్ టేబుల్‌లో త‌న స్థానాన్ని మెరుగుప‌ర‌చుకుంది. 58 శాతం విజ‌యాల‌తో నాల్గో స్థానానికి చేరుకుంది. ఈ వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 4 సిరీస్‌లు ఆడిన టీమిండియా ఆరు విజ‌యాలు సాధించింది. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 2 డ్రా చేసుకుంది.

మొత్తంగా టీమిండియా ఖాతాలో 77 పాయింట్లు ఉన్నాయి. ఈ వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో ఆస్ట్రేలియా అగ్ర స్థానంలో కొన‌సాగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు 2 సిరీస్ మాత్ర‌మే ఆడిన ఆస్ట్రేలియాకు 77 శాతం విజ‌యాలు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 6 టెస్ట్ మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడిన ఆసీసీ నాల్గింట్లో గెలిచి, రెండు మ్యాచ్‌ల‌ను డ్రా చేసుకుంది.

ఇక పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 3 సిరీస్‌లు ఆడిన పాకిస్థాన్ ఖాతాలో 66 శాతం విజ‌యాలు ఉన్నాయి. ఐదు మ్యాచ్‌ల్లో 3 గెలిచిన పాకిస్థాన్, ఒకటి డ్రా చేసుకోగా, ఒక‌టి ఓడింది. ఆ జ‌ట్టు ఖాతాలో 40 పాయింట్లు ఉన్నాయి. ఇక 60 శాతం విజ‌యాల‌తో సౌతాఫ్రికా మూడో స్థానంలో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 2 సిరీస్‌ల్లో 5 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడిన సౌతాఫ్రికా.. 3 గెలిచి.. రెండు ఓడింది. ఈ జాబితాలో 50 శాతం విజ‌యాల‌తో శ్రీ‌లంక ఐదో స్థానంలో ఉంది. ఇప్ప‌టివ‌రకు 2 సిరీస్‌లు మాత్ర‌మే ఆడిన శ్రీ‌లంక 2 గెలిచి, 2 ఓడింది. లంక ఖాతాలో 24 పాయింట్లు ఉన్నాయి.

గ‌త వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ విజేత న్యూజిలాండ్ ఈ జాబితాలో ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 38 శాతం విజ‌యాల‌తో ఆరో స్థానంలో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 3 సిరీస్‌లు ఆడిన కివీస్ 2 మాత్ర‌మే గెలిచి, 3 ఓడి, ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. ఆ జ‌ట్టు ఖాతాలో 28 పాయింట్లు మాత్ర‌మే ఉన్నాయి. ఇక 25 శాతం విజ‌యాల‌తో బంగ్లాదేశ్ ఏడో స్థానంలో, 23 శాతం విజ‌యాల‌తో వెస్టిండీస్ ఎనిమిదో స్థానంలో, కేవ‌లం 11 శాతం విజ‌యాల‌తో వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో ఇంగ్లండ్ చిట్ట చివ‌ర‌న తొమ్మిదో స్థానంలో ఉంది.

Story first published: Tuesday, March 15, 2022, 9:18 [IST]
Other articles published on Mar 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+