Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్లెడ్జింగ్‌పై వెనక్కి తగ్గేది లేదు: ఆసీస్‌కు భారత పేసర్ హెచ్చరిక

హైదరాబాద్: సెప్టెంబర్ 17న చెన్నైలో జరిగే తొలి వన్డేతో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య వన్డే సిరిస్ ఆరంభమవుతుంది. భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లంటే అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. ఎందుకంటే ఈ రెండు జట్ల మధ్య ఆటకన్నా ఎక్కువ స్లెడ్జింగ్‌పైనే అందరి దృష్టి నెలకొని ఉంటుంది కాబట్టి.

స్లెడ్జింగ్‌పై భారత పేసర్ మహమ్మద్‌ షమీ

స్లెడ్జింగ్‌పై భారత పేసర్ మహమ్మద్‌ షమీ

అభిమానులు సైతం ఈ రెండు జట్ల మధ్య స్లెడ్జింగ్ వాతావరణం నెలకొంటే సిరిస్‌కు మజా వస్తుందని కూడా నమ్ముతారు. ఈ క్రమంలో స్లెడ్జింగ్‌పై భారత పేసర్ మహమ్మద్‌ షమీ మీడియాతో మాట్లడాడు. 'స్లెడ్జింగ్‌ ఆటలో భాగమే. మైదానంలో బ్యాటింగ్‌ చేస్తూ ఎక్కువ సమయం క్రీజులో ఉన్న జంటను విడదీసేందుకు స్లెడ్జింగ్‌కి పాల్పడతా' అని అన్నాడు.

బ్యాట్స్‌మెన్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకే

బ్యాట్స్‌మెన్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకే

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి మూడు వన్డేలకు సెలక్టర్లు ప్రకటించిన భారత జట్టులో షమీ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ క్రీజులో పాతుకుపోయిన బ్యాట్స్‌మెన్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఏ ఆటగాడైనా స్లెడ్జింగ్‌కి పాల్పడతాడని తెలిపాడు.

అనుకోకుండా జరుగుతుంది

అనుకోకుండా జరుగుతుంది

నిజానికి ఇదంతా అనుకోకుండా జరుగుతుందని, ఎవరూ కావాలని చేయరని చెప్పుకొచ్చాడు. స్లెడ్జింగ్‌ చేసే సమయంలో అసభ్యకరమైన పదాలు వాడమని కూడా షమీ తెలిపాడు. ‘ఆసీస్‌ జట్టును స్లెడ్జింగ్‌ చేసేందుకు 100శాతం సిద్ధంగా ఉన్నాం. వారు మమ్ముల్ని స్లెడ్జ్‌ చేస్తే వారికి సరైన సమాధానం ఇస్తాం. ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు' అని షమీ అన్నాడు.

భారత్ ఆడిన అన్ని సిరీస్‌ల్లో అద్భుత ప్రదర్శన

భారత్ ఆడిన అన్ని సిరీస్‌ల్లో అద్భుత ప్రదర్శన

ఇటీవల కాలంలో భారత్ ఆడిన అన్ని సిరీస్‌ల్లో అద్భుత ప్రదర్శన చేస్తోందని షమీ పేర్కొన్నాడు. 'శ్రీలంకను క్లీన్‌ స్వీప్‌ చేశాం. ఇప్పుడు ఆసీస్‌పై సిరీస్‌ను గెలుస్తామన్న నమ్మకం ఉంది' అని షమీ పేర్కొన్నాడు. ఇటీవలే శ్రీలంకతో జరిగిన సిరిస్‌లో కోహ్లీసేన ఆతిథ్య జట్టుపై 9-0తో విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+