India Playing XI: అతనికి రెస్ట్.. ఒమన్‌తో తలపడే భారత తుది జట్టు ఇదే!
India Playing XI: ఆసియా కప్ 2025లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఇప్పుడు లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో ఒమన్‌తో తలపడనుంది. ఇప్పటికే యూఏఈ, పాకిస్థాన్‌లను ఓడించి సూపర్-4లో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్న భారత జట్టు, ఒమన్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో కొన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి.. బెంచ్ పై ఉన్నవారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఒమన్‌తో తుది జట్టులో మార్పులు?
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. వారిలో ప్రధానంగా జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వవచ్చని సమాచారం. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ ను జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ ముగిసిన తర్వాత త్వరలోనే వెస్టిండీస్ తో సిద్ధం కావాల్సిన నేపథ్యంలో పనిభారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్టైల్ ప్రకారం.. విన్నింగ్ జట్టునే అలాగే కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి.

జట్టులోని ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని యోచిస్తే.. బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లకు అవకాశం లభించే అవకాశం ఉంది. ఈ మార్పుల ద్వారా యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం కల్పించి, వారిని భవిష్యత్తు కోసం సిద్ధం చేయవచ్చని సమాచారం. కానీ చాలా వరకు విజయవంతమైన జట్టునే మళ్లీ ఆడించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివం దూబే, అభిషేక్ శర్మలకు ఎలాంటి విశ్రాంతి ఉండకపోవచ్చని తెలుస్తోంది.
ఒమన్‌తో భారత తుది జట్టు అంచనా:
శుభ్‌మన్ గిల్
అభిషేక్ శర్మ
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్)
తిలక్ వర్మ
సంజూ శాంసన్
శివం దూబే
హార్దిక్ పాండ్యా
అక్షర్ పటేల్
కుల్దీప్ యాదవ్
జస్ప్రీత్ బుమ్రా/అర్ష్‌దీప్ సింగ్
వరుణ్ చక్రవర్తి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications