పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడిన 24 గంటలు కూడా గడవక ముందే భారత జట్టు మరో మ్యాచ్‌కు రెడీ అయింది. మంగళవారం మధ్యాహ్నం శ్రీలంక, భారత్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరుగుతోంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్‌కు అంతా రెడీ అయింది. అయితే ఇటీవల గాయాల నుంచి తేరుకున్న భారత టీం మేట్స్ కొందరికి విశ్రాంతి చాలా కీలకం.
ఇలాంటి సమయంలో రెండు రోజుల వ్యవధిలో వరుసగా రెండు మ్యాచులు ఆడటం ఈ ప్లేయర్లకు చాలా కష్టం అని నిపుణుల భావన. ఈ క్రమంలో తాజాగా గాయాల నుంచి తేరుకున్న జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ ఇద్దరికీ శ్రీలంక మ్యాచులో విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమచాారం. ఇటీవల గాయం నుంచి తేరుకున్న కేఎల్ రాహుల్.. పాకిస్తాన్‌పై సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.

అలాగే ఇటీవల ఫిట్‌నెస్ నిరూపించుకున్న జస్‌ప్రీత్ బుమ్రా కూడా పాకిస్తాన్‌పై ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో అతనికి కూడా శ్రీలంక మ్యాచులో విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతని స్థానంలో మహమ్మద్ షమీని ఈ మ్యాచ్‌లో ఆడిస్తారని తెలుస్తోంది. అలాగే కేఎల్ రాహుల్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కు మళ్లీ జట్టులో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరికొందరు మాజీలైతే విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని అంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్‌పై సెంచరీ చేయడానికి కోహ్లీ 15 డబుల్స్, 37 సింగిల్స్ తీశాడు. దీంతో అతను చాలా అలసిపోయి ఉంటాడని, ఫ్యూచర్‌ను దృష్టిల పెట్టుకొని కోహ్లీకి శ్రీలంక మ్యాచులో విశ్రాంతి ఇవ్వాలని అంటున్నారు. మరి టీం మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్