వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు రెడీ అయింది. డొమినికా వేదికగా జరిగే తొలి టెస్టు మరికొన్ని గంటల్లో మొదలవనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో కొత్త మొఖాలను చూసే అవకాశం ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆల్రెడీ చెప్పేశాడు. ఎప్పటి నుంచో జట్టులో ఒక లెఫ్ట్ హ్యాండర్ కోసం వెతుకుతున్నామన్న రోహిత్.. ఈ మ్యాచ్‌లో తనతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడని ధ్రువీకరించాడు.
ఇప్పటి వరకు ఓపెనర్‌గా వచ్చిన శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో ఆడతాడని కూడా రోహిత్ కన్ఫర్మ్ చేశాడు. తన కెరీర్‌లో ఎక్కువ కాలం మూడు, నాలుగు స్థానాల్లోనే ఆడానని, అందుకే ఈ మ్యాచ్‌లో కూడా మూడో స్థానంలో ఆడతానని ద్రావిడ్‌తో గిల్ చెప్పాడట. ఇక నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీని ఎవరూ తప్పించలేరు. అలాగే ఐదో స్థానంలో అజింక్య రహానే ఆడతాడు.

అలాగే ఇక్కడి పిచ్‌ను బట్టి తాము ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతున్నట్లు రోహిత్ చెప్పాడు. బృందంలో అక్షర్ పటేల్, జడేజా, అశ్విన్ ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. అయితే వీరిలో ఇద్దర్ని ఆడించాలంటే కచ్చితంగా జడేజా, అశ్విన్ ఆడతారు. జడ్డూ, అక్షర్ దాదాపు ఒకే తరహా బౌలర్లు కావడంతో ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ దక్కనుంది. ఈ లెక్కన ఆరో స్థానంలో జడేజా వస్తాడు.
ఇక ఏడో స్థానంలో కేఎస్ భరత్ లేదా అశ్విన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక వికెట్ కీపర్‌గా భరత్‌నే ఆడించే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఇద్దరు స్పిన్నర్లతో ఆడుతున్న కారణంగా వికెట్ల వెనుక మంచి స్కిల్స్ ఉన్న కీపర్ అవసరం. ఈ విషయంలో కిషన్ కన్నా భరత్ ఒక మెట్టు పైన ఉన్నాడు. దానికితోడు అరంగేట్రం నుంచి భరత్ ఎప్పుడూ టాప్ టీమ్స్‌పైనే ఆడాల్సి వచ్చింది. దీంతో అతను అనుకున్న స్థాయిలో బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేదు. ఈ సిరీస్ అతనికి ఒక మంచి అవకాశంగా చూడొచ్చు.
ఆ తర్వాత ఎనిమిదో స్థానంలో అశ్విన్ ఉంటారు. ఇక ముగ్గురు సీమర్లతో తాము బరిలో దిగుతామని రోహిత్ స్పష్టం చేశాడు. వీరిలో సీనియర్ మహమ్మద్ సిరాజ్ కచ్చితంగా ఆడతాడు. అలాగే జయదేవ్ ఉనద్కత్‌ను కూడా ఆడించడం దాదాపు గ్యారంటీ. చివరి స్థానం కోసం ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్ మధ్య పోటీ ఉంది.
ఆల్‌రౌండర్‌ను తీసుకుంటున్నట్లు రోహిత్ చెప్పలేదు కాబట్టి శార్దూల్‌కు ఈ ఛాన్స్ లేనట్లే. ఇక సైనీ, ముఖేష్ మధ్య గట్టి పోటీ ఉంటుంది. పేస్ ముఖ్యం అనుకుంటే సైనీకి ఛాన్స్ దక్కొచ్చు. ఓవరాల్ పేస్ బౌలింగ్ విభాగంలో వెరైటీ కోరుకుంటే ముఖేష్ కుమార్‌కు అవకాశం ఇస్తారు. సైనీ అయితే ఉమేష్ యాదవ్ పాత్ర పోషించే అవకాశం ఉంది.
రోహిత్ హింట్‌ను బట్టి తొలి టెస్టు ఆడే టీం: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.