For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: వారిద్దరి వల్ల నితీశ్‌‌కు నో ఛాన్స్..బంగ్లాతో ఆడే తొలి టీ20 జట్టు ఇదే!

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. వర్షం ఆటంకం కలిగించినా చరిత్రలో నిలిచిపోయేలా గొప్పగా పోరాడి రెండో టెస్టును గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక బంగ్లాదేశ్‌పై సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్ గెలిచిన టీమిండియా పొట్టి ఫార్మాట్ సిరీస్‌పై కన్నేసింది. సీనియర్ల పోరాట స్ఫూర్తితో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో యువ బృందం పట్టుదలతో ఉంది.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గ్వాలియర్ వేదికగా ఆదివారం తొలి మ్యాచ్ జరగనుంది. టీ20 సిరీస్‌లోనూ భారత్ ఫేవరేటే. తీవ్రంగా ప్రతిఘటించినా టీమిండియాపై బంగ్లాదేశ్ పైచేయి సాధించడం అంత ఈజీ కాదు. జట్టులో యువకులు-అనుభవజ్ఞులతో భారత్ బలోపేతంగా ఉంది. అయితే తొలి టీ20 మ్యాచ్‌లో జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

India Playing XI Hardik Pandya Shivam Dube Cement Spots Nitish Reddy Unlikely for First T20 vs Bangladesh

తొలిసారి టీమిండియాకు ఎంపికైన తెలుగు కుర్రాడు, యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పీడ్ సంచలనం మయాంక్ యాదవ్ తుదిజట్టులో చోటు దక్కించుకుంటారా లేదా అనే ఆసక్తి అందరిలో పెరిగింది. అలాగే హర్షిత్ రాణా ఈసారైనా ప్లేయింగ్ ఎలవెన్‌లో ఉంటాడా లేదా అనే చర్చ మొదలైంది. ఐపీఎల్‌లో స్టార్లుగా గుర్తింపు పొందిన ఈ కుర్రాళ్లు బ్లూజెర్సీలో ఎలా మెప్పిస్తారనే ఉత్కంఠ మొదలైంది. అయితే ఈ ముగ్గురులో ఒక్కరికి మాత్రమే తుదిజట్టులో అవకాశం దక్కేలా ఉంది.

జైస్వాల్, గిల్‌కు విశ్రాంతి ఇవ్వండంతో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌ తొలి టీ20లో బరిలోకి దిగనున్నారు. ఇక వన్‌డౌన్‌లో కెప్టెన్ సూర్య, ఆ తర్వాత రియాన్ పరాగ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వస్తారు. అయితే పేస్ ఆల్‌రౌండర్లుగా హార్దిక్, దూబె తుదిజట్టులో ఉండటంతో నితీశ్‌కు తొలి టీ20లో ఛాన్స్ దక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

ఇక అర్షదీప్ సింగ్‌తో పాటు మయాంక్ యాదవ్ లేదా హర్షిత్ రాణాలలో ఒకరికి తుదిజట్టులో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. శ్రీలంక పర్యటనకు కూడా ఎంపికైన హర్షిత్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువ. బ్యాటు ఝుళిపించే సామర్థ్యం కూడా ఉండటం హర్షిత్ రాణాకు సానుకూలాంశంగా మారింది. ఇక 2021 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున చివరిసారిగా ఆడి తిరిగి భారత జట్టుకు ఎంపికైన వరుణ్ చక్రవర్తి బెంచ్‌కే పరిమితయ్యే అవకాశాలు ఉన్నాయి. రవి బిష్ణోయ్, సుందర్‌ స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు.

బంగ్లాదేశ్‌తో తొలి టీ20‌కు భారత తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్.

Story first published: Thursday, October 3, 2024, 10:03 [IST]
Other articles published on Oct 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+