Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్, రోహిత్ రీఎంట్రీ పక్కా.. జడ్డూపై వేటు.. మూడో వన్డే ఆడే భారత జట్టు ఇదే!

వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీసులో టీమిండియా మళ్లీ కీలక మార్పులతో బరిలో దిగనుంది. తొలి వన్డేలో బ్యాటింగ్ లైనప్‌ను పూర్తిగా మార్చేసిన టీం మేనేజ్‌మెంట్.. రెండో వన్డేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చింది. ఇక మూడో వన్డేలో కూడా కీలకమైన మార్పులు చేసేందుకు రెడీ అయింది.

వరుసగా రెండు వన్డేల్లో ఫెయిలైన సూర్యకుమార్ యాదవ్‌ను ఈ మ్యాచ్‌లో పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో లాస్ట్ ఛాన్స్‌గా అతన్ని ఈ మ్యాచ్ ఆడించే అవకాశం కూడా ఉందని సమాచారం. అలాగే తనకు దక్కిన ఏకైక అవకాశాన్ని వృధా చేసుకున్న సంజూ శాంసన్‌కు మరో ఛాన్స్ ఇవ్వనున్నారు.

India Playing XI for third INDvsWI ODI as Kohli and Rohit returns

తొలి రెండు వన్డేల్లో రాణించిన ఇషాన్ కిషన్‌కు మూడో వన్డేలో కూడా ఆడే ఛాన్స్ దక్కొచ్చు. అతను రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అలాగే గిల్ కూడా మూడో మ్యాచ్ ఆడతాడు. రెండో వన్డేలో టాస్ సమయంలోనే విరాట్, రోహిత్ ఇద్దరూ మూడో వన్డే ఆడతారని పాండ్యా స్పష్టం చేశాడు.

ఈ క్రమంలో రోహిత్ మరోసారి మిడిలార్డర్‌లో ఆడే ఛాన్స్ ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజాకు విశ్రాంతినిచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే.. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ ఆడే జట్లలో జడ్డూ కూడా కచ్చితంగా ఉంటాడు. కాబట్టి అతని స్థానంలో అక్షర్‌ను ఆడించొచ్చు.

శార్దూల్ ఠాకూర్ కూడా జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ముఖేష్ కుమార్ కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. కాబట్టి అతన్ని కూడా మూడో వన్డేలో ఆడించొచ్చు. అదే సమయంలో తొలి రెండు మ్యాచుల్లో విఫలమైన ఉమ్రాన్ మాలిక్‌ను ఆడించడం అనుమానంగా కనిపిస్తోంది.

భారత జట్టు (అంచనా): ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, రోహిత్ శర్మ, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.

Story first published: Monday, July 31, 2023, 8:19 [IST]
Other articles published on Jul 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+