Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!

 India Playing XI for third INDvsNZ T20I

న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు కీలక మ్యాచ్ కోసం రెడీ అవుతోంది. తొలి టీ20లో ఘోరంగా ఓడిపోయిన భారత జట్టు.. ఉత్కంఠ భరితంగా సాగిన రెండో మ్యాచ్‌లో ఒక్క బంతి మిగిలుండగా విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగే నిర్ణయాత్మక మూడో టీ20 కోసం టీమిండియా రెడీ అవుతోంది. ఈ మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం కానుంది.

డేంజర్‌లో నెంబర్ వన్ ర్యాంకు

డేంజర్‌లో నెంబర్ వన్ ర్యాంకు

ప్రస్తుతం టీ20ల్లో నెంబర్ వన్‌గా ఉన్న భారత జట్టు ఆ ర్యాంకు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవక తప్పదు. ప్రస్తుతం టీ20 ర్యాంకుల్లో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య కేవలం ఒక్క రేటింగ్ పాయింట్ మాత్రమే తేడా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితే.. ఇంగ్లండ్‌కు అవకాశం చేజేతులా అందించినట్లే. అంతేకాదు, హార్దిక్ పాండ్యా ఈ ఫార్మాట్లో కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచి ఒక్క సిరీస్ కూడా ఓడలేదు. ఈ మ్యాచ్ ఓడితే ఇదే అతని తొలి సిరీస్ ఓటమి అవుతుంది.

బ్యాటింగ్ పిచ్!

బ్యాటింగ్ పిచ్!

తొలి రెండు టీ20ల్లో బౌలింగ్‌కు సహకరించిన పిచ్.. మూడో మ్యాచులో మాత్రం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ లభించేలా ఉంది. అహ్మదాబాద్ స్టేడియంలో భారీ స్కోర్లు నమోదవడం పరిపాటిగా వస్తోంది. ఇలాంటి పిచ్‌పై జరిగే మూడో వన్డేలో పరుగుల వరద ఖాయమని అంటున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఖాతాలో వేసుకోవాలని పాండ్యా భావిస్తున్నాడు. అదే సమయంలో ఈ సిరీస్ గెలిచి, వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం చేయాలని కివీస్ టీం అనుకుంటోంది.

పృథ్వీ షాకు నో ఛాన్స్?

పృథ్వీ షాకు నో ఛాన్స్?

తొలి రెండు మ్యాచుల్లో భారత జట్టుకు సరైన ఆరంభాలు లభించలేదు. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ పెద్దగా రాణించలేదు. తొలి మ్యాచులో ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. రెండో వన్డేలో కూడా పెద్దగా స్కోర్లు చేయలేదు. ఈ క్రమంలో పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలని నిపుణులు అంటున్నారు. అయితే ఇషాన్, గిల్‌నే కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలోనే మూడో టీ20 కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేసే ఆలోచనలో పాండ్యా లేనట్లు సమాచారం.

 భారత తుదిజట్టు (అంచనా)

భారత తుదిజట్టు (అంచనా)

శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, శివమ్ మావి

Story first published: Monday, January 30, 2023, 13:41 [IST]
Other articles published on Jan 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+