ఆ కుర్రాడి అరంగేట్రం పక్కా.. రెండో టెస్టు ఆడే భారత జట్టు ఇదే!
విండీస్‌పై తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన భారత జట్టు.. రెండో టెస్టులో కూడా బలమైన ప్రదర్శన చేసేందుకు రెడీ అవుతోంది. ట్రినిడాడ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో కూడా కొత్త కుర్రాళ్లకు జట్టులో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ తన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అతనితోపాటు బౌలింగ్ విభాగంలో కూడా ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆల్‌రౌండర్ల కోటాలో అక్షర్ పటేల్ కూడా ఇక్కడ ఆడలేదు. అతను కూడా ఛాన్స్ కోసం చూస్తున్నాడు. అయితే రెండో టెస్టులో గైక్వాడ్‌కు అవకాశం దక్కేలా లేదు. ఎందుకంటే భారత జట్టు బ్యాటింగ్ విభాగం ఇప్పటికే ఫుల్ అయిపోయింది.

జైస్వాల్, రోహిత్, గిల్, కోహ్లీ, రహానే.. ఈ ఐదుగురిలో ఎవరినీ తప్పించడం సాధ్యమయ్యే పని కాదు. ఇక వికెట్ కీపర్‌గా భరత్ కన్నా కిషన్ వైపే టీం మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాబట్టి రెండో టెస్టులో కూడా కిషన్‌కే వికెట్ కీపింగ్ బాధ్యతలు దక్కొచ్చు. ఇక బౌలింగ్ విభాగంలో మహమ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్ ఇద్దరూ తమ స్థానాలు కాపాడుకునే ఛాన్స్ ఉంది.
అయితే శార్దూల్ ఠాకూర్ స్థానంలో ముఖేష్ కుమార్, నవదీప్ సైనీలలో ఒకరికి అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది. వీళ్లిద్దరూ కూడా తమ సత్తా నిరూపించుకునే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ముఖేష్ కుమార్.. దేశవాళీల్లో ఎర్రబంతితో అద్భుతంగా రాణించాడు. అవకాశం ఇస్తే అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించేందుకు రెడీగా ఉన్నాడు. మరి అతనికి ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.
భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications