Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Jasprit Bumrah: కొత్త ఓపెనింగ్ జోడీకి గ్రీన్ సిగ్నల్,, రింకూతోపాటు మరో కుర్రాడి అరంగేట్రం!

గాయంతో 14 నెలలపాటు జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో ఐర్లాండ్ సిరీస్ ప్రారంభం అవనుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌‌లో కొత్త ఓపెనింగ్ జోడీతో భారత జట్టు బరిలో దిగనున్నట్లు సమాచారం. శుభ్‌మన్ గిల్‌ను ఈ సిరీసులో ఎంపిక చేయలేదు.

అతనితోపాటు ఇషాన్ కిషన్‌కు కూడా ఈ సిరీసులో చోటు దక్కలేదు. దీంతో ఐర్లాండ్‌తో సిరీసులో టీమిండియాకు కొత్త ఓపెనింగ్ జోడీ ఆడటం ఖాయమైంది. ఈ బాధ్యతలను యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ తీసుకోనున్నారు. లేదంటే సంజూ శాంసన్ కూడా ఓపెనర్‌గా బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది.

India Playing XI for the first INDvsIRE T20I

ఒకవేళ బుమ్రా అండ్ కో కనుక జైస్వాల్, గైక్వాడ్ జోడీతో ఓపెనింగ్ చేయిస్తే.. మిడిలార్డర్‌లో సంజూ శాంసన్, తిలక్ వర్మ, రింకూ సింగ్ తదితరులు ఆడతారట. అలాగే వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే ఇద్దరికీ ఆల్‌రౌండర్లుగా ఛాన్స్ దక్కనుందట. దూబే ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక బౌలింగ్ విభాగంలో సీనియర్ల వైపే టీం మేనేజ్‌మెంట్ చూస్తున్నట్లు సమాాచారం. గాయాల నుంచి కోలుకున్న జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ కన్ఫమ్‌గా ఆడనున్నారు. వీరితోపాటు అర్షదీప్ సింగ్ ఆడతాడు. సీనియారిటీ ప్రకారం ఈ ముగ్గురికీ ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది.

ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్‌కు కూడా ఆడే అవకాశం ఉంది. కానీ తొలి ముగ్గురితో పోలిస్తే వీరి అనుభవం తక్కువ. అలాగే స్పిన్ బౌలింగ్ విభాగంలో రవి బిష్ణోయి ఆడటం గ్యారంటీగా కనిపిస్తోంది. ఈ బాధ్యతలను వాషింగ్టన్ సుందర్ కూడా పంచుకుంటాడు.

టీమిండియా (అంచనా): రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, సంజూ శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్

Story first published: Thursday, August 17, 2023, 10:10 [IST]
Other articles published on Aug 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+