INDvsNZ : భరత్ అరంగేట్రం.. ఇషాన్ కిషన్ అనుమానమే?.. తొలి వన్డే ఆడే జట్టు ఇదే!

న్యూజిల్యాండ్‌తో తొలి వన్డే ఆడేందుకు భారత జట్టు సిద్ధం అవుతోంది. శ్రీలంక సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. ఇప్పటికే హైదరాబాద్ చేరుకొని తొలి వన్డేకు రెడీ అయింది.
వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ ఫార్మాట్‌పై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని వన్డేల్లోనూ పూర్తి బలమైన జట్టునే ఎంపిక చేస్తోంది. అయితే కివీస్‌తో సిరీస్‌లో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది.

భరత్ అరంగేట్రం?
వన్డేల్లో భారత వికెట్ కీపర్‌గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ తన వ్యక్తిగత కారణాలతో కివీస్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలనే డైలమా ఏర్పడింది. ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వాలని అందరూ అంటున్నారు. అయితే కిషన్ ఓపెనర్. రాహుల్ మిడిలార్డర్ బ్యాటర్. ఇప్పుడు సడెన్‌గా కిషన్‌కు కొత్త రోల్ ఇవ్వడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. అలాంటప్పుడు టీం మేనేజ్‌మెంట్ అంత రిస్క్ తీసుకుంటుందా? అనేది అనుమానమే. ఈ క్రమంలో కేఎస్ భరత్ ఈ సిరీస్‌లో వన్డే అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్
రాహుల్‌తోపాటు టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేట్ కూడా వ్యక్తిగత కారణాలతో కివీస్ టూర్‌కు దూరమయ్యాడు. రాహుల్ తన ప్రేయసి అతియా శెట్టిని వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే అక్షర్ కూడా పెళ్లికి సిద్ధం అయినట్లు సమాచారం. ఈ క్రమంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం దక్కుతుంది. ఇంతకుముందు కూడా న్యూజిల్యాండ్‌పై సుందర్ అద్భుతంగా ఆడాడు. న్యూజిల్యాండ్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో చక్కగా రాణించాడు. దీంతో అతను ఈ మ్యాచ్‌లో కూడా రాణిస్తాడని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

పెద్దగా మార్పుల్లేవ్..
శ్రీలంకపై సిరీస్ గెలిచిన జట్టునే భారత జట్టు కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తోంది. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఈ సిరీస్‌లో లేకపోవడంతో కేవలం వాళ్ల స్థానాల్లో మాత్రమే వేరే వారికి అవకాశం దక్కుతుంది. మిగతా జట్టులో ఎలాంటి మార్పులు జరగబోవని సమాచారం. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ కొనసాగనున్నారు. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ హార్దిక్ పాండ్యా మిడిలార్డర్‌లో కొనసాగుతారు. కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌లో ఒకరికి ఛాన్స్ దక్కుతుంది. షమీ, సిరాజ్, ఉమ్రాన్ పేస్ బౌలర్లుగా ఉండనున్నారు.

భారత తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications