Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL: శ్రీలంకతో తొలి వన్డే ఆడే జట్టు ఇదే.. కేఎల్ రాహుల్ అవుట్?

 India playing XI for first INDvsSL ODI Rohit returns as opener

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ముగిసింది. దీన్ని టీమిండియా విజయంతో ముగించింది. ఇది స్వదేశంలో భారత్ వరుసగా గెలిచిన పదో టీ20 సిరీస్ కావడం గమనార్హం. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో రాహుల్ త్రిపాఠీ, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో భారత జట్టు భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో శ్రీలంక ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.

సీనియర్ల రీఎంట్రీ..

సీనియర్ల రీఎంట్రీ..

ఈ సిరీస్ ముగిసిన నేపథ్యంలో భారత్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు శ్రీలంక సిద్ధం అవుతోంది. టీ20 సిరీస్ సమయంలో విశ్రాంతి తీసుకున్న కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తదితర సీనియర్లు జట్టుతో కలవనున్నారు. గాయంతో చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఈ సిరీస్‌లోనే పునరాగమనం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే అతన్ని తొలి మ్యాచ్‌లోనే ఆడిస్తారా? అనేది అనుమానంగా కనిపిస్తోంది. అతన్ని ఆడించకుండా అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్‌లతో పని కానిచ్చేయాలని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోందట.

ఓపెనర్లు వాళ్లే..

ఓపెనర్లు వాళ్లే..

కెప్టెన్ రోహిత్ శర్మ కచ్చితంగా ఓపెనర్‌గానే వస్తాడు. ఫినిషర్‌గా అతన్ని పంపించాలనే వాదనను టీం మేనేజ్‌మెంట్ సీరియస్‌గా తీసుకోలేదని సమాచారం. ఈ క్రమంలో రోహిత్ ఓపెనింగ్ చేస్తాడు. అతని జోడీగా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లలో ఒకరికి అవకాశం ఇవ్వాలి. బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్‌ వైపు మేనేజ్‌మెంట్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మూడో స్థానంలో విరాట్ కోహ్లీ వస్తాడు. అతను కూడా బంగ్లాపై చివరి వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ముగ్గురు ఆల్‌రౌండర్లు

ముగ్గురు ఆల్‌రౌండర్లు

ఇక కోహ్లీ తర్వాత నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ బరిలో దిగుతారు. వీళ్లిద్దరూ కూడా మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ముగ్గురు ఆల్‌రౌండర్లకు జట్టులో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం లభిస్తుందని సమాచారం. వీళ్లపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సుందర్ అద్భుతంగా రాణించాడు. ఇక దీపక్ హుడా ఇప్పుడిప్పుడే తన ఫినిషర్ పాత్రలో కుదురుకుంటున్నాడు.

బుమ్రాకు విశ్రాంతి?

బుమ్రాకు విశ్రాంతి?

ఈ సిరీస్‌తో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేయాలని జస్‌ప్రీత్ బుమ్రా భావిస్తున్నాడు. వెన్నునొప్పి కారణంగా చాలా కాలంగా అతను జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పూర్తిగా కోలుకున్న అతను బంతితో నిప్పులు చెరిగేందుకు రెడీ అవుతున్నాడు. అయితే అతన్ని వెంటనే బరిలో దించడం మేనేజ్‌మెంట్‌కు ఇష్టం లేనట్లు తెలుస్తోంది. అందుకే మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్‌లను ప్రధాన పేసర్లుగా తీసుకోనుంది. ఇక స్పిన్నర్‌గా కేవలం యుజ్వేంద్ర చాహల్‌ను మాత్రమే తీసుకోవాలని భావిస్తోంది.

భారత తుది జట్టు (అంచనా)

భారత తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

Story first published: Monday, January 9, 2023, 14:29 [IST]
Other articles published on Jan 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+