Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: ఆ ముగ్గురిపై వేటు.. తిలక్‌కు ఛాన్స్- బంగ్లాతో ఆఖరి టీ20 ఆడే జట్టు ఇదే!

టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా బుధవారం జరిగిన రెండో టీ20లో ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి 86 పరుగుల పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా బంగ్లాదేశ్‌పై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. ఇక మూడు టీ20ల సిరీస్‌లో మిగిలిన నామమాత్రపు ఆఖరి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా శనివారం జరగనుంది.

ఇప్పటికే టీ20 సిరీస్ గెలవడంతో బెంచ్ బలాన్ని పరీక్షించుకోవాలని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఖరి టీ20లో భారత తుది జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. నిరాశపరిచినప్పటికీ బ్యాకప్ ఓపెనర్లు లేకపోవడంతో సంజు శాంసన్, అభిషేక్ శర్మను చివరి టీ20లోనూ కొనసాగించనున్నారు.

India Playing XI for 3rd T20I vs BAN Tilak Varma In Hardik Pandya Out in Major Shake up

రెండో టీ20లో సంచలన ప్రదర్శన చేసిన యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిను కూడా జట్టులో కంటిన్యూ చేయనున్నారు. అయితే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. ఢిల్లీ మ్యాచ్‌లో హార్దిక్ కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు. అతనితో సూర్య బౌలింగ్‌ చేయించలేదు. కాగా, హార్దిక్ పాండ్య స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు అవకాశం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియంలో జరిగే ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఇద్దరు తెలుగు ప్లేయర్లు భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు.

అలాగే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్ తిరిగి జట్టులోకి రానున్నాడు. మూడేళ్ల తర్వాత వరుణ్ భారత జట్టుకు ఎంపికవ్వడంతో తొలి రెండు మ్యాచ్‌ల్లో రవి బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. దీంతో హర్షిత్ రాణా అరంగేట్రం చేయనున్నాడు. వాస్తవానికి శ్రీలంక సిరీస్ నుంచి బెంచ్‌కే పరిమితమవుతున్న హర్షిత్ ఇప్పటికే టీమిండియా జెర్సీ ధరించాల్సి ఉంది.

కానీ ఈ కేకేఆర్ బౌలర్ హర్షిత్‌కు కెప్టెన్ సూర్య-కోచ్ గంభీర్ తుదిజట్టులో ఛాన్స్ ఇవ్వలేదు. ఉప్పల్ మ్యాచ్‌లోనూ హర్షిత్‌కు అవకాశం రాకపోతే.. ఈ కుర్రాడిని కేకేఆర్ రూ.4 కోట్లు తక్కువ ధరకే రిటైన్ చేసుకోవచ్చు. లేదంటే రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

బంగ్లాదేశ్‌తో ఆఖరి టీ20 ఆడే భారత జట్టు (అంచనా)
సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, అర్షదీప్ సింగ్/హర్షిత్ రాణా.

భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్.

Story first published: Thursday, October 10, 2024, 17:41 [IST]
Other articles published on Oct 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+