Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma : రెండో టెస్టు కోసం టీంలో మార్పులు.. రోహిత్ ఏమన్నాడంటే?

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కొత్త సైకిల్‌ను భారత జట్టు ఘనంగా ఆరంభించింది. వెస్టిండీస్‌పై తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ ఇద్దరూ అరంగేట్రం చేశారు. జైస్వాల్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకోగా.. కిషన్ కూడా కీపింగ్‌లో ఫర్వాలేదనిపించాడు. అతనికి బ్యాటింగ్‌లో సత్తా నిరూపించుకునే అవకాశం దక్కలేదు.

ఈ క్రమంలో రెండో టెస్టులో టీమిండియాలో ఎలాంటి మార్పులు చేస్తారని అందరూ చర్చించుకుంటున్నారు. రుతురాజ్ గైక్వాడ్‌కు అరంగేట్రం చేసే ఛాన్స్ ఇస్తారా? అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. అతను ఆడాలంటే ఎవరిని పక్కన పెట్టాలన్నది మరో ప్రశ్నగా మారింది. ప్రస్తుతం భారత జట్టులో జైస్వాల్, రోహిత్, గిల్, కోహ్లీ, రహానేకు టాప్-5 స్థానాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాయి.

 India Playing XI changes Rohit Sharma gives clarity

ఇలాంటి సమయంలో గైక్వాడ్‌కు అరంగేట్రం చేసే ఛాన్స్ దక్కడం అనుమానమే. అలాగే బౌలింగ్ విభాగంలో కూడా ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లలో ముఖేష్‌ తొలి టెస్టు ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ టీం మేనేజ్‌మెంట్ మాత్రం శార్దూల్ ఠాకూర్ వైపు మొగ్గు చూపింది. కానీ అతను అనుకున్నంత ప్రభావం చూపలేదు.

ఈ క్రమంలో జట్టులో చేసే మార్పులపై తాజాగా రోహిత్ శర్మ మాట్లాడాడు. జట్టులో మరీ భారీ మార్పులు ఏవ చేయడం లేదని రోహిత్ స్పష్టం చేశాడు. 'డొమినికాలో పిచ్ చూడగానే కండిషన్స్ ఎలా ఉంటాయ క్లియర్‌గా ఒక అంచనా వేయగలిగాం. కానీ ఇక్కడ అది కుదిరేలా లేదు. ఎందుకంటే ఇక్కడ వర్షం పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే టీమిండియాలో మరీ భారీ మార్పులైతే ఏవీ ఉండవు' అని రోహిత్ చెప్పాడు.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో పరిస్థితులను బట్టి జట్టును ఎంపిక చేస్తామని టీమిండియా కెప్టెన్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను ఆడించే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై రోహిత్ స్పందించలేదు. అదే సమయంలో కుర్రాళ్లు రాణిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశాడు.

Story first published: Thursday, July 20, 2023, 10:04 [IST]
Other articles published on Jul 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+