India Playing 11 vs Zimbabwe: ధావన్, గిల్, అక్షర్, ప్రసీద్ ఔట్.. రాహుల్ త్రిపాఠి సహా ఈ నలుగురు బరిలోకి..!

హరారే: ఇప్పటికే 2- 0 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న భారత టీం.. మూడో వన్డేలో కూడా గెలిచి వైట్ వాష్ చేసుకోవాలని చూస్తుంది. రెండు మ్యాచుల్లో ఘన విజయాలు సాధించిన భారత్ మూడో వన్డేలో గెలవడం కూడా దాదాపు ఖాయమే. నేడు జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత జట్టులో ప్రధానంగా పలు మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ఈ సిరీస్లో భారత సీనియర్ మరియు స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి దక్కింది. దీంతో యువ టీం కేఎల్ రాహుల్ సారథ్యంలో జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఇక బౌలింగ్ యూనిట్లో భారత్ ఎక్కువగా రొటేషన్ పాలసీని అమలుపరుస్తుంది. ప్రధాన కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ గైడెన్స్‌లో అందరికీ అవకాశాలు దక్కే వీలుంది. ముఖ్యంగా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్న రాహుల్ త్రిపాఠి, షాబాజ్ అహ్మద్‌లకు ఈ మ్యాచ్‌లో చోటు దక్కడం ఖాయమని తెలుస్తోంది. సన్ రైజర్స్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన రాహుల్ త్రిపాఠి ఇప్పటి వరకు పలు సిరీస్‌లకు ఎంపికైనా తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఇక రుతురాజ్ గైక్వాడ్ సైతం వన్డేల్లో అరంగేట్రం కోసం వెయిట్ చేస్తుండగా.. అతనికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించనుంది. ఇక భారత ప్లేయింగ్ 11 గురించి ఓసారి పరిశీలిస్తే..

ఓపెనర్లుగా వీరు
భారత వన్డే ఓపెనింగ్ జోడీ అయిన శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ అద్భుతంగా ఆకట్టుకుంటుంది. వీరు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పుతూ జట్టుకు మంచి స్టాండ్ ఇస్తున్నారు. విండీస్ పర్యటన నుంచి ఈ జోడీ రాణిస్తుంది. ఇక ఈ మ్యాచ్‌లో మాత్రం వీరిద్దరికి విశ్రాంతినివ్వడం ఖాయం. జట్టులో బెంచ్ ప్లేయర్ల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉన్న మంచి అవకాశం మూడో వన్డే కాబట్టి వీరి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశముంది. లేదా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ బరిలోకి దిగొచ్చు.

మిడిలార్డర్లో వీరు
జింబాబ్వేతో రెండు వన్డేల్లో భారత్ ఛేజింగ్ చేయడంతో భారత మిడిలార్డర్‌కు తగినంత బ్యాటింగ్ అవకాశాలు దక్కలేదు. అందువల్ల మిడిలార్డర్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశాలు కన్పించడం లేదు. అయితే అరంగేట్రం చేయడానికి చూస్తున్న రాహుల్ త్రిపాఠిని మాత్రం మిడిలార్డర్ లైనప్లో తీసుకోవడం ఖాయం. ఇక నంబర్ 3 బ్యాటర్‌గా రాహుల్ త్రిపాఠి బరిలోకి దిగనున్నాడు. నంబర్ 4 స్థానంలో రుతురాజ్ లేదా కేఎల్ రాహుల్ (వీరిలో ఒకరు ఓపెనర్‌గా బరిలోకి దిగుతారు) ఆడనున్నారు. నంబర్ 5 స్థానంలో దీపక్ హుడా, నంబర్ 6 స్థానంలో సంజూ శాంసన్ ఆడొచ్చు. అయితే వీరిద్దరి బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త మార్పులు జరగొచ్చు.

లోయర్ ఆర్డర్, టెయిలెండర్లుగా వీరు
ఇక నంబర్ 7 స్థానంలో అక్షర్ పటేల్ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్షర్‌కు విశ్రాంతి దక్కనుంది. అతని స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ బరిలోకి దిగనున్నాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులోకి ఎంపికైన షాబాజ్ అహ్మద్ ఈ మ్యాచ్‌లో గనుక ఆడకపోతే మళ్లీ అతనికి జట్టులో చోటు దక్కాలంటే చాలా టైం పడుతుంది. అందువల్ల అతన్ని బరిలోకి దింపేందుకే మేనేజ్ మెంట్ ప్రయత్నిస్తుంది. ఇక టెయిలండర్ల విషయానికొస్తే.. మహమ్మద్ సిరాజ్‌కు విశ్రాంతి దక్కనుంది. నంబర్ 8గా దీపక్ చాహర్ తుది జట్టులోకి రానున్నాడు. నంబర్ 9, 10, 11 ప్లేయర్లుగా శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ప్రసీద్ క్రిష్ణ బరిలోకి దిగనున్నారు.

జింబాబ్వేతో మూడో వన్డేకు భారత తుది జట్టు అంచనా :
1. ఇషాన్ కిషన్, 2. రుతురాజ్ గైక్వాడ్, 3.రాహుల్ త్రిపాఠి, 4.కేఎల్ రాహుల్ (కెప్టెన్), 5.దీపక్ హుడా, 6.సంజూ శాంసన్, 7.షాబాజ్ అహ్మద్, 8.దీపక్ చాహర్, 9.శార్దూల్ ఠాకూర్, 10.కుల్దీప్ యాదవ్, 11. ప్రసీద్ క్రిష్ణ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications