
24 గంటల్లో మరో మ్యాచ్..
ఆ తరువాత ఆడుతోన్న మూడో సిరీస్ ఇది. ఐర్లాండ్‌పై టీ20, ఇంగ్లాండ్‌పై టీ20తో పాటు వన్డే సిరీస్‌ను గెలిచింది. వెస్టిండీస్‌పైనా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇవ్వాళ ఇదే పిచ్‌పై వెస్టిండీస్‌తో అయిదో మ్యాచ్‌ను ఆడబోతోంది. ఇదే చివరిది. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. సోనీ లివ్ దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఘన విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది టీమిండియా.

ఇషాన్‌కు ఛాన్స్..
ఇప్పటికే సిరీస్ సొంతమైనందున కేప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్- ఒకట్రెండు ప్రయోగాలకు సిద్ధపడే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం బెంచ్‌కే పరిమితమైన ఇషాన్ కిషన్‌ను తుదిజట్టులోకి తీసుకోవచ్చు. ప్రస్తుతం అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడుతోన్నాడు. ఓపెనర్‌గా గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. కేప్టెన్ రోహిత్ శర్మతో కలిసి జట్టు ఇన్నింగ్‌ను ఆరంభిస్తోన్నాడు. రోహిత్‌కు సరైన జోడీ అనిపించుకున్నాడు.

ప్రయోగాల వైపు..
ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ముందున్నందున కొన్ని ప్రయోగాలు చేయడం వైపే రోహిత్ శర్మ-రాహుల్ ద్రావిడ్ మొగ్గు చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌ను సత్తాకు పరీక్ష పెట్టొచ్చు. రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం వల్ల జట్టుకు అందుబాటులో లేకుండా పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో అతనికి ప్రత్యామ్నాయంగా సూర్యకుమార్ యదవ్‌ను క్రీజ్‌లోకి దించింది. ఇది విజయవంతమైంది. ఇప్పుడిక ఇషాన్ కిషన్ ఆ అవకాశం ఇవ్వొచ్చు.

హర్షల్ పటేల్ బ్యాక్ టు హోమ్
ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ గాయపడ్డ విషయం తెలిసిందే. రిబ్ ఇంజ్యూరీతో అతను బాధపడుతున్నాడు. స్వదేశానికి చేరుకోనున్నాడు. నాలుగో మ్యాచ్‌కు మిస్ అయ్యాడు. ఇవ్వాళ్టి మ్యాచ్‌కూ దూరం అయ్యాడు. టీ20ల్లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరున్న హర్షల్ పటేల్‌ను టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం నాటికి పూర్తిగా సన్నద్ధం చెయ్యాల్సి ఉన్న నేపథ్యంలో అతనికి విశ్రాంతి ఇవ్వనుంది బీసీసీఐ. ఈ మెగా ఈవెంట్ వరకు అతణ్ని ఆడించడానికి అంగీకరించకపోవచ్చు.

పరువు కోసం వెస్టిండీస్..
తన పరువు నిలబెట్టుకోవడానికి వెస్టిండీస్ జట్టు ప్రయత్నిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సిరీస్‌లల్లో చతికిలపడింది. ఇప్పటికే వన్డే సిరీస్‌లో వైట్ వాష్ అయింది. 3-0 తేడాతో ఓడింది. టీ20 సిరీస్‌ను కోల్పోయింది. కనీపం ఇవ్వాళ్టి మ్యాచ్‌లోనైనా గెలిచి తీరాలని భావిస్తోంది. ఇప్పటివరకు ఎదురైన పరాజయాల నుంచి గుణపాఠాలను కరేబియన్లు ఏ స్థాయిలో నేర్చుకున్నారనేది ఇవ్వాళ్టి మ్యాచ్ రిజల్ట్ మీద ఆధారపడి ఉంది.

తుదిజట్టులో..
టీమిండియా ప్లేయింగ్ 11లో- రోహిత్ శర్మ (కేప్టెన్), సూర్యకుమార్ యాదవ్/ఇషాన్ కిషన్, సంజు శాంసన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, దినేష్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్/రవి బిష్ణోయ్ ఆడే అవకాశం ఉంది.
వెస్టిండీస్ తుదిజట్టులో- కైలె మేయర్స్, బ్రెండన్ కింగ్, నికొలస్ పూరన్ (కేప్టెన్), షిమ్రోన్ హెట్మెయిర్, రౌమన్ పావెల్, డెవాన్ థామస్ (వికెట్ కీపర్), జేసన్ హోల్డర్, అకీల్ హొస్సెన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెద్ మెక్‌కే ఆడొచ్చు.


Click it and Unblock the Notifications











