India Playing 11: ఆ ముగ్గురు ఔట్.. దీపక్ హుడా, అర్షదీప్, రవి బిష్ణోయ్ జట్టులోకి...!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5టీ20 మ్యాచ్‌ల సిరీస్లో 0-2తేడాతో టీమిండియా వెనకబడి ఉంది. ఇక నేడు మన విశాఖపట్టణంలో మూడో టీ20 జరగనుంది. సిరీస్ చేజార్చుకోకుడదంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పకుండా గెలిచి తీరాలి. విశాఖపట్టణంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో మ్యాచ్ రాత్రి 7.00గంటలకు ప్రారంభం కానుంది. ఇక 3వ టీ20 ముందు టీమిండియా తుది జట్టు(ప్లేయింగ్ 11)లో మార్పులు తథ్యంగా కన్పిస్తున్నాయి. రెండు టీ20ల్లో అంచనాల మేరకు రాణించని వారిని తప్పించి.. బెంచ్ మీద ఉన్న ప్లేయర్లను వారి స్థానంలో తుది జట్టులోకి మేనేజ్ మెంట్ తీసుకోవాలని చూస్తోంది. ఇక అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం. కానీ మూడో టీ20 సిరీస్ విషయంలో అత్యంత కీలకమైనది కావడంతో అతన్ని మేనేజ్ మెంట్ ఆడించేందుకు మొగ్గుచూపకపోవచ్చు. ఎందుకంటే ఉమ్రాన్ వికెట్ టేకర్ అయినప్పటికీ పొదుపుగా బౌలింగ్ చేయగలడా అనే సందేహాలు అతనిపై నెలకొన్నాయి. ఈ క్రమంలో టీమిండియా ప్లేయింగ్ 11లో ఎవరెవరిని తీసుకుంటుందో ఓ సారి విశ్లేషిస్తే..
రుతురాజ్ గైక్వాడ్ స్థానానికి ఢోకా లేదు
పేలవమైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ రుతురాజ్ గైక్వాడ్ స్థానానికి ఢోకా లేనట్లు కన్పిస్తుంది. టీమ్ మేనేజ్‌మెంట్ గైక్వాడ్ స్థానంలో వెంకటేష్ అయ్యర్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించడానికి సుముఖంగా లేదని తెలుస్తోంది. గైక్వాడ్ నిలదొక్కుకుంటే తప్పకుండా టీమిండియాకు ప్లస్ అవుతుంది. దీంతో ఇషాన్ కిషన్‌తో కలిసి రుతురాజ్ గైక్వాడ్ 3వ టీ20లోనూ ఓపెనింగ్ చేయొచ్చు. రుతురాజ్ రెండు మ్యాచ్‌ల్లో కేవలం 24పరుగులు మాత్రమే చేశాడు.

అక్షర్ పటేల్ ఫెయిల్.. అతని స్థానంలో
టీమిండియా అక్షర్ పటేల్‌ను ఆల్రౌండర్‌గా భావించి ఈ సిరీస్లో ఆడిస్తున్నా.. అతను అంత ప్రభావవంతంగా రాణించడం లేదు. తొలి టీ20లో అంతంతమాత్రంగా బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్.. రెండో టీ20లో పూర్తిగా నిరాశపరిచాడు. అతను ఒకే ఓవర్లో 19పరుగులు ఇచ్చుకున్నాడు. అలాగే బ్యాటింగ్లోనూ అక్షర్ (10పరుగులు 11బంతుల్లో) రెండో టీ20లో నిరాశపరిచాడు. దినేష్ కార్తీక్ కంటే ముందే అతన్ని పంపించినా.. అతను హిట్టింగ్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక అక్షర్ స్థానంలో దీపక్ హుడాను తుది జట్టులోకి మేనేజ్ మెంట్ తీసుకోనుంది. హుడా ఐపీఎల్లో మంచి ఫామ్ కనబర్చిన సంగతి తెలిసిందే. హుడా మిడిల్ ఆర్డర్‌లో సమర్ధుడైన బ్యాటర్ మరియు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు.

అవేశ్ ఖాన్ పర్లేదు.. అయినా అందుకే అర్షదీప్ సింగ్
ఐపీఎల్లో డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ అని పేరున్న అర్ష్‌దీప్ సింగ్ మూడో టీ20లో తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. అతను పెద్ద వికెట్ టేకరేం కాకున్నా..బ్యాటర్లను కట్టడి చేయడంలో దిట్ట. టీమిండియా రెండో టీ20ల్లో ప్రారంభ 8ఓవర్ల పాటు చాలా బాగా బౌలింగ్ చేసినా.. డెత్ ఓవర్లలో మాత్రం ఫెయిలైంది. అందువల్ల డెత్ స్పెషలిస్ట్ జట్టుకు కావాల్సిన అవసరముంది. అందువల్ల అర్షదీప్ సింగ్‌ను అవేశ్ ఖాన్ స్థానంలో తీసుకునే అవకాశముంది. అయితే అవేశ్ ఖాన్ సైతం బానే బౌలింగ్ చేస్తుండడంతో 3వ టీ20లోనూ అతన్ని ఆడించే అవకాశం లేకపోలేదు.

చాహల్‌ను ఇక నమ్మలేం..
రెండు మ్యాచ్‌లలో యుజ్వేంద్ర చాహల్ చాలా పేలవ బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. తొలి మ్యాచ్‌లో 2.1ఓవర్లలో 26పరుగులిచ్చిన చాహల్, రెండో మ్యాచ్‌లో 4ఓవర్లలో 49పరుగులిచ్చాడు. రెండో టీ20లో ఇండియా ఓటమికి కారణాల్లో చాహల్ చెత్త బౌలింగ్ ఒకటి. అతను రాణించకపోవడంతో అతన్ని పక్కనపెట్టి స్పెషలిస్ట్ స్పిన్నర్ రవిబిష్ణోయ్ తుది జట్టులోకి రావొచ్చు. మిడిల్ ఓవర్లలో కట్టడి చేసేలా రవి బిష్ణోయ్ బౌలింగ్ చేయగలడు.

తుది జట్టు అంచనా :
ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్) (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), దినేష్ కార్తీక్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications